Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:09 pm IST

Menu &Sections

Search

భవిష్యత్ నిజంగా తెలుసుకోవచ్చా? భవిష్యత్ దర్శనమౌతుందా!

భవిష్యత్ నిజంగా తెలుసుకోవచ్చా? భవిష్యత్ దర్శనమౌతుందా!
భవిష్యత్ నిజంగా తెలుసుకోవచ్చా? భవిష్యత్ దర్శనమౌతుందా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రతి మనిషికి తన భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసు కోవాలనే కోరిక ఉంతుంది ఈ కనీసం నిద్రాణంగానైనా! శత సహస్రాబ్ధాల ఈ కుతూహలమే భవిష్యదర్శనానికి దారి తీసింది "ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?" అని అందరికీ తెలిసినా, తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆరాటం చాలామందికి ఉంటుంది
అలాంటి వారు భవిష్యదర్శనం కోసం జ్యోతిశ్శాస్త్రాన్నిగాని, సంఖ్యాశాస్త్రాన్ని గాని  హస్తసాముద్రికాన్ని గాని, ప్రశ్నచెప్పేవారిని గాని, సోది చెప్పేవారిని గాని, చివరకు చిలక జోస్యాన్ని గాని నమ్ముతూ ఉంటారు.
bhavishyat-nu-mundugaanea-darsinchavacchaa!
చివరి మూడింటినీ వదిలేస్తే మొదటి మూడింటి మీద మార్కెట్లో బోలెడన్ని పుస్తకాలున్నాయి. అంటే వీటిని నమ్మేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. వీటిలో ఖగోళశాస్త్రం మీద ఆధారపడింది జ్యోతిశ్శాస్త్రం. మనిషిమీద గ్రహాలు, నక్షత్రాల ప్రభావాన్ని అంచనావేసి చెబుతుంది. మనిషి మీద గ్రహాల ప్రభావం ఉందన్నది సుస్పష్టం అయితే ఇది మనిషికీ, మనిషికీ మారుతూ ఉంటుంది. ప్రతి అమావాస్య, పున్నమినాడు  వాయువు సోకేవాళ్ళు - అంటే 'ఫిట్స్ ' వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు గతం లోనూ, ఇప్పుడూ కూడా!  మిగతా రోజుల్లో వాళ్ళు చాలా ఆరోగ్యంగా సాధారణంగానే ఉంటారు. అంటే వాళ్ళ ఆరోగ్యం మీద సూర్య చంద్రుల ప్రభావం కనీసం చంద్రకళల ప్రభావం ఉన్నదన్నట్లే కదా! 
bhavishyat-nu-mundugaanea-darsinchavacchaa!
ఇంకో ఆసక్తికరమైన విశేషమేమిటంటే రష్యా రాజధాని మాస్కోలోని ఒక ప్రాంతంలో భూమి ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఉబ్బి, కొన్ని గంటల తర్వాత మామూలుగా అయిపోతుందట. ఈ విషయం తెలుగుతో బాటు అనేక భాషల్లోకి అనువదించబడిన "ఖగోళశాస్త్రం-విజ్ఞానం-వినోదం" అనే రష్యన్ పుస్తకంలో ఉంది. రాసింది జ్యోతిష్కులు కాదు. రష్యన్ శాస్త్రవేత్తలు. గ్రహస్థితుల ప్రభావం గట్టినేల మీదే అంత బలంగా కనబడు తున్నప్పుడు అతి నున్నితమైన సుతి మెత్తని మనిషి మెదడు మీద ఎందుకు పడకూడదు?

ఈ గ్రహచారం అప్పుడే పుట్టిన శిశువు మెదడు మీద కలిగించే ప్రభావం ఆ శిశువు భవిష్యజ్జీవితాన్ని శాసిస్తుందని ఒక నమ్మకం. కాదనడమెందుకు? కానీ -
ఆ ప్రభావం ఎలా ఉంటుంది?
ఉన్నా నిర్దేశిత సంఖ్య లోనే ఉంటుందా?
అట్లైతే ప్రపంచంలో ఆ పరమిత సంఖ్యలోనే మనుషుల రకాలు ఉండాలి కదా?
సాధారణంగా ఎవరి జాతకమైనా సౌరమానంలో ఒకరకంగా, చాంద్రమానంలో ఇంకొక రకంగాను ఎందుకుంటుంది?
ఇవి సమాధానం లేని ప్రశ్నలు.
bhavishyat-nu-mundugaanea-darsinchavacchaa!
ఇంకో చిత్రం చమత్కారం ఏమిటంటే జాతకాల మీద ఉన్న ఏ పుస్తకం పరిశీలించినా మనకు తోచిన రాశిని  (మీ స్వంత రాశే కానక్ఖర్లేదు, ఏ రాశైనా ఫర్వాలేదు) ఎంచుకుని ఏముందో పూర్తిగా చదవండి.  దాంట్లో కనీసం ఒకటి రెండు అంశాలైనా అచ్చం మీ గురించే  చెబుతున్నట్లు అనిపిస్తాయి. మీ రాశిలో మీకు వర్తించని అంశాలు కూడా చాలా నే ఉంటాయి. ఈ రాశి ఫలాలన్నీ తొలితరం జ్యోతిష్కులు తమ కంటికి కనిపించే వాస్తవాలకు, కనబడని గ్రహగతులకు తర్కరహితంగా ముడిపెట్టి రాసినవి. 

పై పెదవి చీలి ఉండే జన్యుపరమైన లోపాన్ని తల్లి గర్భస్థంలో గ్రహణ దర్శనంతో ముడిపెట్టి దాన్ని గ్రహణం మొర్రి అనడం లాంటివే ఇవి కూడా. అందుకే ఆధారపడ దగ్గవి కాదు. జాతకాల మీదున్న మంచి పుస్తకాల్లో ఒక్కో రాశి కింద ఒకటి లేదా రెండు "వ్యక్తిత్వ వికాసం" సలహాలు ఉంటాయి. అదొక ప్రయోజనం.

పూర్వకాలం నుంచి మనవాళ్ళకో నమ్మకముంది. ఉత్తరం వైపు తలపెట్టి ఎప్పుడూ పడుకోవద్దని. దాని వెనకుండే వినాయకుడి కథ ఎలా ఉన్నా ఆధునిక విజ్ఞానశాస్త్రం ఆ నమ్మకాన్నే సమర్థిస్తుంది  భూమికి ఉత్తర ధృవం, దక్షిణ ధృవం ఉన్నాయి కదా? ఆ రెండు దిక్కుల్లోనే భూగోళం యొక్క విద్యుత్ అయస్కాంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగా మనం ఉత్తరం వైపు గానీ, దక్షిణం వైపు గానీ తలపెట్టుకుని ఎక్కువసేపు పడుకుంటే భూ-అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల మనకు నిద్ర లేచిన తర్వాత నీరసంగా, తలదిమ్ముగా ఉండడం, ఉత్సాహం లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయట. 
bhavishyat-nu-mundugaanea-darsinchavacchaa!
ఇక ఇతర శాస్త్రాల కొస్తే సంఖ్యాశాస్త్రం బొత్తిగా ఆధారపడ దగ్గది కాదు. మనం దశాంశమానం కాకుండా అష్టాంశమానాన్ని పాటిస్తే ఏడురకాల మనుషులే ఉండే వాళ్ళు-సంఖ్యాశాస్త్రాన్ని బట్టి చూస్తే. అలాగే షోడశమానాన్ని పాటిస్తే పదహారు రకాల మనుషులుండేవాళ్ళు. ఇలాంటి శాస్త్రాన్నెలా నమ్మడం? పైన పేర్కొన్న మిగతా పద్ధతులూ అంతే!
bhavishyat-nu-mundugaanea-darsinchavacchaa!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జపాన్ వాళ్ళంతే - మిర్రర్ న్యూరాన్ల స్పందన ఎక్కువట? అందుకే అలా తయారయ్యారు!
షాకింగ్! బీజేపిలోకి సుజానా!
గోవు పరమ పవిత్రం - గోవు వలన ప్రయోజనాలు
ఎడిటోరియల్: దేశంలో ఏ ఇతర నాయకునికి లేని ఆ రోగమే చంద్రబాబు కొంప ముంచింది?
సండే స్పెషల్: చీరకట్టు - కనికట్టు - చీరలో మన హీరోయిన్స్
పదవి పోయినా ఆ ఫోజు మారలేదు - ఇంగువ కట్టిన గుడ్డ వాసన పోనట్లు - టిడిపి గతి అంతే!
ఏపికి ప్రత్యేక హోదా అత్యవసరం, ఇచ్చి ఆదుకోండి : సీఎం వైఎస్ జగన్
పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి “పవన”మో! పలాయనమో!
"షా" వెరైటీ మామిడి పండు - అమృతఫలం రుచి, రూపం, బరువు అద్భుతం
ఈ పిల్ల అందాలకు జిమ్ బయట ఇంటి బయట కాపలా పెట్టాల్సిందే!
తెలంగాణాలో బీజేపి విజృంభణ - రాంమాధ‌వ్ నేతృత్వంలో 'ఆపరేషన్ కమలం'!
అబద్ధాలు-చంద్రబాబు-చరిత్రవక్రీకరణ - కవలపిల్లలు
ఎమెల్యే ఆర్కె రోజా కం-బాక్ అగెయిన్! చెవిరెడ్డి భాస్కరరెడ్డి సవాల్!
చంద్రబాబు తన అహంభావాన్ని అహంకారాన్ని విస్మరించలేరని మరోసారి ఋజువైంది
చంద్రబాబు తీరుతో  టిడిపి భవితవ్యం -
చిట్టి గౌనులో పొట్టి పాపా ! పొట్టి గౌనులో చిట్టి పాపా ! చెప్పుకోండి చూద్ధాం: అంటుంది యువత
నాలుగు దశాబ్ధాల అనుభవం-మళ్లి మొదలెట్టిన  శ్రీచంద్ర నీతులు
About the author