చట్టాలు అమలు చేయాల్సిన వారు వాటిని చుట్టబండలు చేయడం అంటే ఏమిటో.. ఎస్వీ యూనివర్సిటీ లో జరిగిన ఒక సంఘటన పరిశీలిస్తే ఇట్టే ఎవరికైనా అర్ధమవుతుంది . ఎస్వీ యూనివర్శిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ అయన సహచరులు ఒక వికలాంగుడ్ని నిర్బంధించి, తమకు అనుకూలమైన పత్రాలపై అతడి చేత బలవంతంగా సంతకం చేయించుకున్న ఘటన జరిగి రోజులు గడుస్తున్నా, ఇంతవరకూ ఇంచార్జ్ రిజిస్ట్రార్ , అతని సహచరులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకుండా చోద్యం చూస్తుండడం , చట్టం ఉన్నవాళ్లకు చుట్టమేనన్న నానుడి మరొకసారి రుజువయింది .


 ఈ సంఘటనపై సోషల్ మీడియా లో విస్తృత స్థాయి లో ప్రచారం జరిగినా స్థానిక పోలీసులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం విడ్డూరంగా ఉండదన్న విమర్శలు నెటిజన్ల నుంచి విన్పిస్తున్నాయి . వికలాంగుని బలవంతంగా నిర్బంధించడం , అతన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తించడం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని ఇండియన్ ఫినల్ కోడ్ చెబుతోంది . మరి ఇండియన్ ఫినల్ కోడ్ ను అమలు చేయాల్సిన పోలీసులు ఒక వికలాంగుని నిర్బందించడమే కాకుండా , అతన్ని తమ చర్యల ద్వారా మానసికంగా, శారీరకంగా వేధించిన వారిపై చట్టరీత్యా ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్న తలెత్తుతోంది.


అంతటితో ఆగకుండా తమకు అనుకూలమైన పత్రాలపై వారు బలవంతంగా ఒక వ్యక్తి చేత సంతకాలు చేయించుకోవడం అన్నది చట్టరీత్యా నేరమని, ప్రాథమిక అవగాహన ఉన్న వారెవరైనా ఇట్టే చెబుతారు . మరొక యువకున్ని ఇంచార్జ్ రిజిస్ట్రార్, ఆయన సహచరులు నిర్బంధించి బలవంతంగా తమకు అనుకూలమైన పత్రాలపై సంతకం చేయించుకున్నారని తెలిసి కూడా పోలీసులు  చర్యలు తీసుకోకపోవడం పరిశీలిస్తే … పోలీసులు వారికి కొమ్ము కాస్తున్నట్లు స్పష్టం అవుతోందని,  ఈ సంఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు .


 పోలీసులు ఇప్పటికైనా వికలాంగుని నిర్బంధించి, వేధించిన ఇంచార్జ్ రిజిస్ట్రార్ , ఆయన సహచరులుపై కేసులు నమోదు చేసి,  చట్టం ఉన్న వారికేమి చుట్టం కాదని నిరూపిస్తారా? లేకపోతే ఎవరు ఏమి అనుకుంటే మాకేంటని కళ్ళు , చెవులు మూసుకుంటారా?? చూడాలి మరి .   


మరింత సమాచారం తెలుసుకోండి: