ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరికొకరు అంటుకు తిరగడమే కాకుండా డేటింగ్‌లంటూ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం పట్ల చేస్తున్న వ్యాఖ్య.నేటి యువతరం యమ స్పీడు గురు!’ అని పెద్దలు ఊరికే అనరు కదా.

 

వాట్సప్, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మీడియాలే కాకుండా డేటింగ్‌ యాప్‌గా ముద్రపడిన ‘టిండర్‌’ లాంటి యాప్‌లు యువతీ యువకులు కలిసి తిరగడానికి, సన్నిహితంగా మెలగడానికి పెళ్లికి ముందే లైంగిక అనుభవాలు చవి చూడడానికి దోహదపడుతున్నాయనడంలో సందేహం లేదు.

 

2000 సంవత్సరంలో మా ఆఫీసులో కలుసుకున్న వారు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం మాకే అశ్చర్యం కలిగించింది’ అని ‘ఎట్‌ మేక్‌ మై ట్రిప్‌’ సహ వ్యవస్థాపకులు సచిన్‌ భాటియా వ్యాఖ్యానించారు.దాన్ని స్ఫూర్తిగా తీసుకొనే 2013లో తమ సంస్థ డేటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ట్రూలీమ్యాడ్లీ’ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

 

‘నేటి తరానికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంది. సమాజంలో రిస్కులు తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.ఓ 28 ఏళ్ల యువతి తనతో చెప్పడం తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని ఢిల్లీకి చెందిన రచయిత్రి అంకిత ఆనంద్‌ తెలిపారు. ‘మా తరంలో స్నేహానికే సమయం ఉండేది కాదు. కలుసుకునేందుకు కాఫీడేలు కూడా లేవు. ఈ తరాన్ని చూస్తే కొంత అసూయ వేస్తోంది’ అని 36 ఏళ్ల సౌమ్యా బైజాల్‌ అన్నారు. ఆయన పక్కనే ఉన్న ఈ తరానికి చెందిన ఆయన కుమారుడు ‘తరం తరానికి తేడా ఎప్పుడూ ఉంటుంది. నా భవిష్యత్‌ తరాన్ని చూసి నేను కూడా అసూయ పడే రోజు వస్తుంది. అది తప్పదు!’ అన్నారు.

 

అయితే ఈ వ్యాఖ్యలో ఆందోళనకంటే తమకూ అలాంటి అవకాశం లేకుండా పోయెనే అన్న అసూయనే ఎక్కువగా కనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: