వాణిజ్యశాస్త్ర ప్రకారం సంపద రెండు రకాలు. ఒకటి ఎదుటి వారికి ఇచ్చేకొద్ది ఆ సంపద తరిగి పోతుంది. ఈ విషయంలో డబ్బు బంగారం లాంటివి ఉదాహరణగ చెప్పుకోవచ్చు. ఇక రెండవ సంపద మన మానసిక స్థితికి సంబంధించింది. వాటిలో బాంధవ్యాలు ప్రేమానురాగాలు కీర్తి గౌరవం లాంటివి. వీటిని మనం ఎదుటి మనిషికి షేర్ చేసే కొద్ది అవి మనలో పెరుగుతూ ఉంటాయి. 

అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీత లో ఐశ్వర్యం లభించాలి అంటే మనం ఎలా ఉండాలో అర్జునుడు ద్వారా మనకు ఉపదేశించాడు. వాటిలో ముఖ్యంగా పెర్కొన్నదగ్గ విషయాలు భయం లేకుండా ఉండటం-నిర్మలమైన మనసును కలిగి ఉండటం-అహింస-దానగుణం-కోపరాహిత్యం-త్యాగ గుణం-మృదుత్వం-ఓర్పు సుచి శుభ్రత నిగర్వం- లాంటివి 24 గుణాలను దైవ సంపదలుగా పేర్కొని ఆ సంపదలు కలిగిన వారు ఖచ్చితంగా ఐశ్వర్య వంతులు అయితీరుతారు అని భగవాన్ శ్రీకృష్ణుడు ఈ మానవాళికి ఉపదేశించాడు.

ఇప్పుడు అదే విషయాలను స్పూర్తిగా తీసుకుని హార్వార్డ్  యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఆర్ధిక శాస్త్ర వేత్త మార్క్ ధన సంపాదనకు సంబంధించి ‘టెన్ కమాండ్ మెంట్స్’ అనే పుస్తకం వ్రాసారు. ఈ పుస్తకంలో వివరించబడ్డ పది విషయాలను ఏవ్యక్తి అయితే ప్రతిరోజు అనుసరిస్తూ ఉంటాడో ఆవ్యక్తి ఐశ్వర్య వంతుడు అవడం ఖాయం. 

మార్క్ అభిప్రాయం ప్రకారం ధనం సంపాదించే ఏవ్యక్తి అయినా డబ్బును తక్కువగా అంచనా వేయకూడదు. అదేవిధంగా డబ్బును ఎక్కువగా కూడ అంచనా వేయకూడదు. అలాగే వ్యారంలో స్నేహితులు ఉండ కూడదు. మనకు తెలిసిన దానిని చెప్పడానికి సంసయించకుండా వ్యాపార వ్యవహారాలలో అతి తక్కువగా మాట్లాడే వ్యక్తి మాత్రమే ధన వంతుడు కాగలుగుతాడని ఈ రచయిత అభిప్రాయం. చేసిన చిన్న వాగ్దానాన్ని కూడ మర్చి పోకుండా ఉండే వ్యక్తి మాత్రమే ధనం సంపాదించగలుగుతాడు. మన వస్తువుకు విలువ ఇవ్వని వ్యక్తి వ్యాపారానికి పనికిరాడని అందరితో సఖ్యతగా ఉంటూ మన క్రింది వారితో మన విజయాన్ని పంచుకోగలిగినప్పుడు మాత్రమే ఏ వ్యక్తి అయినా తాను ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధించి ఐశ్వర్య వంతుడు కాగలుగుతాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: