ఒక వ్యక్తి ఎంతటి ఐశ్వర్య వంతుడు అయినా సరైన ఆరోగ్యంతో ఉండకపోతే తనకు ఉన్న సంపదను అనుభవించలేడు. అందుకే శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడ సంపదలో ఒక భాగంగా పరిగణిస్తారు. ఆరోగ్యం అంటే రోగాలు అనేక రకాల జబ్బులు లేకపోవడమే కాదు మానసికంగా ధృఢoగా ఉండటం కూడ ఆరోగ్య సంపదగానే గుర్తిస్తారు.


మనిషి అంటే కేవలం శరీరం ఒక్కటే కాదు మనసు హృదయం ఆత్మ శరీరం ఈ నాలుగింటి సమ్మేళనమే మనిషి అని ఆధ్యాత్మిక వేత్తలు చెపుతూ ఉంటారు. కోటాను కోట్ల జీవ కణాలతో నిర్మితమైన మన శరీరంలో రోగాలను నయం చేసే అనేక అద్భుత శక్తులు ఉన్నాయి అన్న విషయం అనేక పరిశోధనలలో వెల్లడి అయింది. ముఖ్యంగా మన శరీరంలోని కాలేయం ఒక్కటే 10 రకాల మందులను తయారు చేస్తూ మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతూ ఉంటుంది.


అయితే అలాంటి అత్యంత శక్తివంతమైన కాలేయాన్ని అనేకమంది తమకు ఉన్న మద్యపాన వ్యసనాలు వల్ల పాడు చేసుకుంటూ అనేక రోగాల బాట పడుతున్నారు. వాస్తవానికి ఈరోజు ప్రపంచంలో ఉన్న అనేక రుగ్మతలకు వైద్య సహాయం లేకుండానే మన శరీరం తనకు తానుగా ఆ రుగ్మతలను నయం చేసుకోగలుగుతుంది. అయితే అటువంటి అవకాశాన్ని మనం మన శరీరానికి ఇవ్వకుండా ప్రతి చిన్న విషయానికి మందులు వేసుకునే అలవాటు చేసుకోవడంతో మన శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గి పోతోంది అని అనేక పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.


వాస్తవానికి ఒక వ్యక్తి ప్రతిరోజు కనీసం గంట సమయం ఈత నడక సైకిల్ తొక్కడం యోగాసనాలు వేయడం అలాట్లను చేసుకుంటే మన శరీరంలోని అనేక రోగాలను నిర్మూలించే పనిని ‘లింప్’ అనే శారీరక వ్యవస్థ నిర్వర్తిస్తుందని వైద్య నిపుణులు కూడ అంగీకరిస్తున్నారు. అందుకే ఆరోగ్యకరమైన శరీరం అతిథి గృహం లాంటిది. అనారోగ్యకరమైన శరీరం జైలు లాంటిది అని లార్డ్ బేకన్ అభిప్రాయపడ్డారు. అందువలన ఎవరైతే ఆరోగ్యాన్ని ఒక సంపదగా గుర్తించ గలుగుతారో వారే నిజమైన ధనవంతులు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: