కరోనా దెబ్బతో భారత పారిశ్రామిక రంగం అతలాకుతులం అవుతున్న పరిస్థితులలో ఈ మహమ్మారి కారణంగా 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు ఘోరంగా క్షీణిస్తుందని అంచనాలు వేస్తున్న ప్రపంచ బ్యాంకు అధ్యయనం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. భారతదేశం మైనస్ 3 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. దీనికికారణం లాక్ డౌన్ కారణంగా ఆర్థికవ్యవస్థ పై కోలుకోలేని దెబ్బ పడిందని ఆ నివేదిక అభిప్రాయపడుతోంది కరోనా పరిస్థితులు మరింత దిగజారితే ఆర్ధిక వృద్ధి మైనస్ 5.2 శాతంకు పడిపోయినా ఆశ్చర్యంలేదు అంటూ ఆ నివేదిక అభిప్రాయపడుతోంది.


1870 తర్వాత వచ్చిన అత్యంత దారుణమైన మాంద్యం ఇదేనని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ దీనికితోడు  అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు మూడీస్ ఫిచ్ ఎస్ అండ్ పీ కూడ భారత ఆర్థికవ్యవస్థ 4 శాతం నుండి 5 శాతం వరకు ప్రతికూల వృద్ధిని సాధిస్తాయని అంచనా వేయడం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య పేద మధ్య తరగతి ఆదాయ కుటుంబాలకు నగదు బదలీ వేతన మద్దతు పన్ను చెల్లింపులు వాయిదా వేయడం వంటి చర్యలు చెప్పట్టకపోతే భారత ఆర్ధిక పరిస్థితి ఊహలకు కూడ అందని విధంగా ఉంటుంది అన్నఅంచనాలు వస్తున్నాయి.  


1870 తర్వాత ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే ఒక మహమ్మారి గా పిలవ బడుతున్న కరోనాను ఎదుర్కొనడంలో భారత్ ఫెయిల్ అయింది అన్న అభిప్రాయం కూడ ఈనివేదిక ద్వారా అర్థం అవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి విపత్కర పరిస్థితులు భారత్ ఎప్పుడు ఎదుర్కొనలేదు అన్న అభిప్రాయం ఆ నివేదికలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో అనేక చిన్నతరహా మధ్య తరహా పరిశ్రమలకు చైనా నుంచి ముడి సరుకులు ఆగిన పరిస్థితులలో ముడి సరుకులు లేక పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకుంటున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో లాక్ డౌన్ నుండి మినహాయింపులు వచ్చినా పరిశ్రమలు ఎలా ఉత్పత్తిని కొనసాగిస్తాయి అన్న విషయం పై సమాధానాలు దొరకక తలలు పండిన ఆర్ధిక వేత్తలు కూడ తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులలో తిరిగి ప్రజలు దీక్ష తో ఈ విపత్కర పరిస్థితులలో ఎవరి వృత్తులను వారు చేసుకుంటూ పరిస్థితులను ఎదిరించగలిగితే ఆర్ధికంగా ఎదుగుదల వచ్చి సంపన్నులు కాగలుగుతారు..

మరింత సమాచారం తెలుసుకోండి: