కరోనా పరిస్థితుల తరువాత షేర్ మార్కెట్ అనేక ఒడుదుడుకులు ఎదుర్కుని ప్రస్తుతం కొంతవరకు రికరీ అయినా ప్రముఖ కంపెనీల షేర్ల విలువ ఈ జూన్ త్రైమాసికంకు సంబంధించి జూలై లో ప్రకటించే వాటి ఫలితాలను బట్టి మళ్ళీ షేర్ మార్కెట్ లో ఎక్కువ హెచ్చు తగ్గులు ఏర్పడే ఆస్కారం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో షేర్ మార్కెట్ కంటే చిన్నచిన్న మొత్తాలు క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక అయిన SIP ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెడితే భవిష్యత్ లో నికరమైన ఆదాయాలు వస్తాయి అని ఆర్ధిక విశ్లేషకుల అభిప్రాయం.


కరోనా పరిస్థితుల వల్ల బ్యాంకులకు సంబంధించిన ఫిక్సెడ్ డిపాజిట్ల పై వడ్డీలు బాగా తగ్గించివేసారు. ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా సరైన ప్రణాళికలతో ఈ కరోనా సమయంలో పొదుపులు చేయడం ప్రారంభించి కొన్ని సంవత్సరాలు వేచి ఉండగలిగితే మంచి ఫలితాలు వస్తాయి అని మనీ ఎక్స్ పర్ట్స్ అంచనా.


ఉదాహరణకు రోజూ 100 రూపాయలు ఆదా చేయడం ద్వారా ఎవరైనా 20 లక్షల రూపాయలు పొందవచ్చు. రోజుకు 100 రూపాయలు ఆదా చేయడం వల్ల ఎవరిపైనా ఒత్తిడి ఏర్పడదు. ఇలా ప్రతిరోజు మనం పొదుపు చేసే నెలకు 3,000 రూపాయలు అవుతుంది కాబట్టి ఆ మొత్తాన్ని క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక SIP ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకంలో ప్రతి నెలా 3,000 పెట్టుబడి పెట్టాలి. ఇలా ఎవరైనా క్రమం తప్పకుండా 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల తరువాత 20 లక్షల రూపాయల ఆదాయం సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ 15 సంవత్సరాలలో మనం పెట్టిన పెట్టుబడి 5.40 లక్షల రూపాయలు మాత్రమే అయితే అది మనం ఎంచుకున్న SIP పదకాలలో వచ్చే వడ్డీలు వల్ల 14.60 లక్షల రూపాయల లాభం చేకూరి మనకు 20 లక్షల ఆదాయాన్ని సంపాదించి పెడుతుంది. ఇలాంటి మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో చాల ఉన్నాయి ఈ పదకాల గురించి కొద్దిగా అవగాహన చేసుకుంటూ క్రమపద్ధతిలో పెట్టుబడులు పెట్టగలిగిన వారికి ఈ కరోనా సమయంలో కూడ డబ్బు సంపాదన కష్టం కాదు..

మరింత సమాచారం తెలుసుకోండి: