కరోనా వైరస్ విలయతాండవంతో దేశ ఆర్ధిక వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసే స్టాక్ మార్కెట్ సూచీలు రోజుకు ఒక విధంగా మారుతున్న పరిస్థితులలో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వారి ఆదాయాలు ఎలా ఉంటాయో ఎవరి ఊహలకు అందడం లేదు. ముఖ్యంగా చిన్న స్థాయిలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టెవారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది.


ఈ పరిస్థితులలో తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కుంటున్న స్టాక్ మార్కెట్ లో  పెట్టుబడి పెట్టి ప్రస్తుతం అనేకమంది సామాన్యులు వేల కోట్లల్లో నష్టపోతున్నారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఎవరైనా షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు స్వల్పకాలిక లక్ష్యాలతో కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో షేర్లను కొనుగోలు చేసిన వారు మాత్రమే లాభ పడతారని ప్రస్తుతం షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే వారికి చాల ఓర్పు ఉండాలి అని ఆర్ధిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ప్రస్తుత పరిస్థితులలో అనేక మ్యూచువల్ ఫండ్స్ దివాలా తీస్తున్న పరిస్థితులలో చిన్నచిన్న పెట్టుబడులు పెట్టే వ్యక్తులు తమ డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి అని ఆర్ధిక విశ్లేషకులు హెచ్చరికలు ఇస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న స్థిరాస్థి హోటల్స్ పర్యాటక ఆధారిక కంపెనీల షేర్లలలో పెట్టుబడి పెట్టడం ఏమాత్రం మంచిదికాదని చిన్నచిన్న మొత్తాలలో పవర్ టెలికాం ఫార్మా లోహాలు ఫుడ్ ఇండస్ట్రీలలో పెట్టుబడి అంతా ఒక దానిపై కాకుండా అన్ని కంపెనీలకు సంబంధించిన షేర్స్ పై దీర్ఘకాలిక లక్ష్యాలతో షేర్లలో పెట్టుబడి పెడితే ఆ షేర్లలలో కొన్ని షేర్లు అయినా రానున్న కాలంలో రెట్టింపు విలువ పెరిగి ఆదాయాన్ని ఇస్తాయని ప్రస్తుత మార్కెట్ గమనాన్ని తెలివిగా అంచనా వేయగల వ్యక్తి మాత్రమే ఈ ష్టాక్ మార్కెట్ వ్యవహారాలలో విజేత కాగలడు అంటూ అనేక ఆర్ధిక నిపుణులు ఇస్తున్న సలహాలు అనుసరించిన వాడు మాత్రమే ఐశ్వర్య వంతుడు కాగలుగుతాడు..  
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: