కరోనా తో ఆర్ధికవ్యవస్థ తల్లక్రిందులు అయిపోతున్నా చెక్కు చెదరనిది ‘బంగారం’ మాత్రమే. మేలిమి బంగారం పది గ్రాములు 50వేలకు చేరుకోవడంతో మరో నెలరోజులలో బంగారం 52 వేలకు చేరుతుందని ఆర్ధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకప్రముఖ జ్యూయలరీ వ్యాపారవేత్త అంచనా ప్రకారం రానున్న రెండేళ్ళల్లో బంగారం ధర 10 గ్రాములు లక్ష రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదు అని వస్తున్న అంచనాలు బంగారం పై విపరీతమైన పెట్టుబడులకు మోజును పెంచుతున్నాయి.


ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉండటంతో అందరు సురక్షిత పెట్టుబడి సాధనాలపై ఫోకస్ పెడుతున్నారు. దీనితో ముందుగా అందరి చూపు బంగారం పై పడుతూ ఉండటంతో బంగారం ధర పరుగులు పెడుతోంది. గత రెండేళ్లుగా బంగారం పై పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని అందించడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలంటే బంగారమే సరైన సాధనం అన్నఅభిప్రాయం అందరిలో ఏర్పడటంతో ఇలా బంగారం ధర పరుగులు తీస్తోంది అని అంటున్నారు.


ఎన్నో దేశాల్లో లాక్‌డౌన్‌ అమలవుతున్నందున సరఫరా డిమాండ్ కుప్పకూలాయి. ఇటువంటి పరిస్థితుల్లో మదుపరులు బంగారం పెట్టుబడి సాధనాలైన ఈటీఎఫ్‌లు డిజిటల్‌ గోల్డ్‌ కమాడిటీ ఫ్యూచర్స్‌ గోల్డ్‌ బాండ్స్‌ పై ఆసక్తి చూపే చూపుతున్నారు. చాలమంది షేర్ మార్కెట్లు ఇతర బాండ్ మార్కెట్ల నుంచి నిష్క్రమించి సురక్షిత పెట్టుబడి అయిన బంగారం వైపు అడుగులు వేస్తూ ఉండటంతో బంగారం ధరలు ఇలా పెరుగుతున్నాయి అని విశ్లేషకుల అభిప్రాయం. దీనికితోడు పలుదేశాల్లో సమీప భవిష్యత్తులో లిక్విడిటీ సమస్యలు తలెత్తటంతో పాటు ద్రవ్యోల్బణం నిరుద్యోగం ద్రవ్య లోటు ప్రధాన సమస్యలుగా మారబోతున్న కరోనా పరిస్థితుల మధ్య ప్రస్తుతం సురక్షితమైన పెట్టుబడికి సాధనంగా ఒక్క బంగారాన్ని మాత్రమే గుర్తిస్తున్నారు.


కరోనా సమస్యతో ఇప్పటికే పలుదేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈపరిస్థితులలో బంగారం నిల్వలు భారీగా కలిగి ఉన్న జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ బ్రిటన్ లు తమ బంగారాన్ని భారీ మొత్తంలో అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించే అవకాశాలు ఉన్నాయి అన్నసంకేతాలు వస్తున్నాయి. అదేజరిగితే ఈసంవత్సరాంతానికి బంగారం ధర భారీగా దిగి రావచ్చు అన్న అంచనాలు కూడ ఉన్నాయి. దీనితో సమీప భవిష్యత్తులో బంగారం ధరలు అనేక ఒడుదుడుకులకు లోనయ్యే పరిస్థితులలో బంగారం అతి జాగ్రత్తగా వ్యవహరించమని విశ్లేషకుల హెచ్చరికలతో జాగ్రత్తలతో కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: