ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా కల్లోలంతో భారత ఆర్ధికపరిస్థితి దిగజారుతుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత్ జీడీపీ మైనస్ 5.3 శాతానికి క్షీణించ వచ్చని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో తెలియచేసిన అంశాలు కలకలం సృష్టిస్తున్నాయి.


దేశ చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయి వృద్ధి ఈ సంవత్సరం రికార్డ్ కాబోతోందని దీనితో కొన్ని లక్షల సంఖ్యలో ఉద్యోగాలు తొలగింపు జరగడమే కాకుండా మన దేశ ఆర్ధిక వ్యవస్థ కోలుకోలేని విధంగా తీవ్రస్థాయిలో దెబ్బతింటుంది అన్న సంకేతాలు నివేదిక ఇస్తోంది. ఆర్ధిక వ్యవస్థలోవాణిజ్య కార్యకలాపాలు వృద్ధి చెందే ఆస్కారం కనిపించడంలేదనీ మనదేశ ఎగుమతులు 9.4 శాతం తగ్గే సూచనలు కనిపిస్తూ ఉండటంతో వాణిజ్యలోటు 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకోబోతోందని ఈనివేదిక హెచ్చరికలు ఇస్తోంది.


వాస్తవానికి మన దేశఆర్ధిక వ్యవస్థ పై కొవిడ్ ప్రభావం అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉంటుందని ప్రముఖ ఆర్ధిక వేత్త గీత గిపీనాత్ చేసిన కామెంట్స్ ఈ నివేదికలో పొందుపరిచారు. దీనికితోడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న బాయ్ కాట్ చైనా ఉద్యమం ఆచరణలో సాధ్యం కాదనీ కొందరు వ్యక్త పరుస్తున్న అభిప్రాయాలను కూడ ఈ నివేదికలో పొందుపరిచారు.


ప్రస్తుతం మనదేశం చేసుకునే దిగుమతులలో చైనా వాటా 18 శాతం ఉన్న నేపధ్యంలో ఈ దిగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయం ఆలోచించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే ఆనిర్ణయం భారతదేశంలోని పారిశ్రామిక రంగం పై ప్రభావం చూపెడుతుందని అందువల్ల దేశీయంగా మనకు మనమే వస్తువులను తాయారు చేసుకునే సామర్ధ్యం పెంచుకున్నాక మాత్రమే చైనాతో వాణిజ్య సంబంధాలు కట్ చేసుకునే స్థితికి చేరుకోగలము అని ఆనివేదిక అభిప్రాయం. దీనికోసం ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు చేయాలని భవిష్యత్ లో ఏ ఇతర దేశం పై కూడ ఆధారపడకుండా నిలబడగలిగే స్థాయికి భారత్ చేరుకునేవరకు ఈ కష్టాలు తప్పవు అంటూ ఈ నివేదిక పలుసూచనలు చేసింది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: