కొవిడ్ సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలకు ఆదాయం తగ్గిపోయి ఉద్యోగులకు వేతనాలు తగ్గించడమే కాకుండా ఉద్యోగాలను కూడ తీసివేస్తూ వ్యయ నియంత్రణ పై దృష్టి పెడుతున్నాయి. అయితే ఇలాంటి వ్యతిరేక పరిస్థితులలో కూడ కొన్ని కంపెనీలు నియామకాలు చేపడుతు భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తున్న విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపడతారు.


క్లౌడ్ కంప్యూటింగ్ కాంటాక్ట్ లెస్ టెక్నాలజీ డేటా ప్రాసెసింగ్ వంటి విభాగాలలో  కంపెనీలు సమర్ధులైన వ్యక్తుల గురించి అన్వేషణ చేయడమే కాకుండా వారికి భారీ శాలరీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ లో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సేవలు అందిస్తున్న కంపెనీలు ఈనియామకాలు చాల భారీ ఎత్తున చేపడుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం కరోనా సమస్యలు ఉన్నప్పటికీ ఫుడ్ ఔషదాలు రక్షణా ఆన్ లైన్ లావాదీవీలు నిర్వహించే కంపెనీలకు పెద్దగా కరోనా ప్రభావం లేకపోవడంతో ఈరంగాలలో రానున్న రోజులలో చాల భారీగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అని అంటున్నారు.


వీటికితోడు ప్రస్తుతం ఇండియాలో హెల్త్ కేర్ రంగాలకు చెందిన ప్రొడక్ట్స్ ను అందించే కంపెనీలు కూడ తమ ఉత్పత్తిని పెంచుకోవడానికి అనేక చోట్ల కొత్త నియామకాలు చేస్తున్నారు. భవిష్యత్ లో నెట్ వర్కింగ్ రంగంలో కూడ అనేక కంపెనీలు రంగంలోకి రాబోతున్న పరిస్థితులలో ఈ రంగాలలో కూడ అనేక ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.


ప్రస్తుతం కరోనా సమస్యలు వల్ల ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా పని చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా ప్రబలడంతో పలుదేశాల విదేశీ కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపడుతు ‘వర్క్ ఫ్రమ్ ఎనీ వేర్’ దిశగా ప్రపంచ కంపెనీలు అడుగులు వేస్తున్న పరిస్థితులలో అనేక ఉద్యోగ అవకాశాలు టెలికాం రంగంలో నెట్ వర్కింగ్ రంగంలో రాబోతున్నాయని అంటున్నారు. దీనికి అనుగుణంగా కరోనా పరిస్థితులను ద్వేషించకుండా దానికి తగ్గట్టుగా మన సామర్ధ్యాలను మెరుగుపరుచుకోగలిగితే పైన పేర్కొన్న రంగాలలో యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చి మంచి ప్యాకేజీలతో సంపన్నులు కాబోతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: