ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కర్నాటకలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని గిరీష్ కర్నాడ్ డిమాండ్ చేస్తున్నందుకు ఆయనను చoపేస్తాము అంటూ ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గిరీష్ కర్నాడ్ ప్రకటన హిందువులను ముఖ్యంగా వక్కలింగ వర్గాన్ని అవమానిస్తున్నట్లుగా భావిస్తూ గిరీష్ కర్నాడ్ పై కొందరు పోలీసులకు ఫిర్యాద్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

మొన్న మంగళ వారం టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా గిరీష్ కర్నాడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఈ నటుడుకి ఈ బెదిరింపులు వస్తున్నట్లు టాక్. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నిరసిస్తూ కర్ణాటకలో జరిగిన ఒక నిరశన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో పోలీసు కాల్పుల్లో ఓ వీహెచ్‌పీ కార్యకర్త మరణించిన విషయం తెలిసిందే. 

అయితే తన వ్యాఖ్యలతో రేగిన వివాదం పై ప్రముఖ నటుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడ అయిన గిరీష్ కర్నాడ్ క్షమార్పణలు చెప్పాడు. ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే క్షమార్పణలు చెబుతున్నానని ప్రకటన ఇచ్చాడు. అయినా గిరీష్ కర్నాడ్ ను టార్గెట్ చేస్తూ కన్నడ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. 

ఈ విలక్షణ నటుడు మన తెలుగులో కూడ అనేక ప్రముఖ సినిమాలలో నటించాడు. ఇతడు తెలుగులో నటించిన ‘ఆనందభైరవి’ తెలుగు సినిమాలలో ఒక క్లాసిక్ గా పరిగణిస్తూ ఉంటారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గిరీష్ కర్నాడ్ శిష్యుడు అన్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ గిరీష్ కర్నాడ్ తో కలిపి ఎన్నో నాటకాలలో నటించిన మెప్పించిన విషయం తెలిసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: