బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా తమిళనాడు లోని చెన్నై నగరం పూర్తిగా జలసంద్రంగా మారిపోయింది. దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఇంత బీభత్సకరమైన వానలు వచ్చాయట. ఎడతెరిపి లేకుండా పడ్డ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి..లక్షల మంది నిరాశ్రయులయ్యారు..వేల కోట్లలో నష్టం వాటిల్లింది. వర్షాలకు జననష్టం కూడా భారీ ఎత్తున జరిగింది..ఈ వర్ష బీభత్సం సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేశాయి.  

చెన్నై విడిచి ఔట్ డోర్ లో ఉన్న వారికి  తమ వారికి ఏం జరిగిందో తెలుసుకునేందుకు కమ్యూనికేషన్ కూడా లేకుండా అల్లాడి పోయారు. క్రికెటర్లు, సినీమా స్టార్లు  చెన్నై వరదల్లో చిక్కుకున్న తమ వారు గురించి క్షేమ సమాచారాలు తెలుసుకునేంత వరకు కంగారు పడ్డారు. కమెడియన్ వివేక్ హైదరాబాద్ లో చిక్కుకుపోయి చెన్నయ్ లో తమవారికి ఏమైపోయిందోనని ఆవేదన చెందారు. ఇక తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించిన స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొందట.  చెన్నైలో వచ్చిన వరదల సమయంలో సమంత విజయవాడలో ఉండిపోయిందట. అక్కడ తమవారు ఏమైపోయారో అన్న ఆవేదనతో మూడు రోజుల పాటు కంటిమీద నిదురే లేకుండా గడిపేసిందిట.


వరదల్లో చిక్కుకున్న ప్రజలు


ఓ వైపు కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోయింది. ఫోన్ చేసి మాట్లాడే అవకాశం కూడా లేదు. దాంతో ఎంతో కలత చెందానని సమంత చెప్పింది. అయితే తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్య జనం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అని ఆవేదన చెందింది. అన్నపానియాలు లేక అక్కడ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అని వాపోయింది. తను కూడా చెన్నై వాసులకు సహాయం చేయడానికి వెళ్లనున్నట్లు తెలిపింది. అయితే  బ్రహ్మోత్సవం షూటింగు లో బాగంగా విజయవాడలో ఉన్నట్లు త్వరలో చెన్నై కి వెళ్లి తన వంతు సహాయం చేయాలని సమంత చెప్పుకొచ్చింది. ప్రత్యూష ఫౌండేషన్ తరపున ఇప్పటికే ఎందరో చిన్నారులకు లైఫ్ నిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: