ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో హిట్ సినిమాలు బాగానే వచ్చాయి..అయితే కళ్యాన్ రామ్ నిర్మాతగా మారి రవితేజ హీరోగా తీసిన కిక్ 2, రాంచరణ్ బ్రూస్ లీ లాంటి పెద్ద హీరోల సినిమాలు కాస్త నిరాశ పరిచాయి. ముఖ్యంగా మాస్ మహరాజ గత కొంత కాలంగా పెద్ద హిట్ సినిమాలు ఏవీ రాలేదు..కిక్ 2 పై ఆశపెట్టుకున్నా అది కూడా తుస్ మనిపించింది. దీంతో భారీ అంచనాలతో రచ్చ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ సినిమా కసి కొద్దీ చేశాడు.

ఈ సినిమాలో తమన్నా,రాశీఖన్నా ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు. నిన్న భారీ ఎత్తున రిలీజ్ అయిన రవితేజ బెంగాల్ టైగర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12 కోట్లను కలెక్ట్ చేసింది . రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున దాదాపు 750 కి పైగా థియేటర్ లలో రిలీజ్ అయిన బెంగాల్ టైగర్ చిత్రానికి మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. కామెడీ, యాక్షన్ ఓరియెంటెడ్ గా రూపొందిన ఈ చిత్రంలో రవితేజ మాస్ యాక్షన్ కి ప్రేక్షకులు మళ్లీ ఫిదా అయ్యారు.



బెంగాల్ టైగర్ పోస్టర్


ఇక వయ్యారి భామ తమన్నా తన అందాలన్నీ ఆరబోసింది.. రాశీఖన్నా అయితే బికినితో కుర్రకారుని మరీ రెచ్చగొట్టింది. ఒక్కరోజే దాదాపు 12 కోట్ల వసూళ్ళ ని రాబట్టాడు బెంగాల్ టైగర్ . రవితేజ పెర్ఫార్మెన్స్ ,తమన్నా ,రాశి ఖన్నా ల గ్లామర్ ,పృథ్వీ ,పోసాని కామెడీ బెంగాల్ టైగర్ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి . సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కే కే రాధామోహన్ నిర్మించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: