మెగా అభిమానులు ఫోర్బ్స్ పత్రిక లేటెస్ట్ గా ప్రకటించిన ర్యాంకింగ్స్ పై విపరీతమైన కోపంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో సెలెబ్రెటీలకు మూడు రకాల ర్యాంకులను ఇచ్చి మనీర్యాంకు, ఫేమ్ ర్యాంకు, ఓవరాల్ ర్యాంకు అంటూ మూడు క్యాటగిరీల్లో దేశవ్యాప్తంగా వందమంది సెలబ్రిటీలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ కు సంబంధించి ఈపత్రిక ప్రకటించిన ర్యాంక్స్ అప్పుడే వివాదాస్పదంగా మారిపోయాయి. 

ముఖ్యంగా ఈ పత్రిక ర్యాంక్స్ ను మెగా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు అని టాక్. రవితేజా లాంటి హీరోలకు కూడ స్థానం ఇచ్చిన  ఫోర్బ్స్ పత్రిక మెగా కుటుంబ హీరోలకు ముఖ్యంగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ల విషయంలో చాల అన్యాయం చేసిందని మెగా అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి సంపాదించి సంపాదన, వ్యాపారాల విషయంలో మెగా కుటుంబంలోని రామ్ చరణ్ ను మించిన ధనవంతుడు టాలీవుడ్ లో ఉన్నాడా అంటూ మెగా అభిమానులు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. 

చరణ్ కు హార్స్ పోలో టీము, విమానయాన సంస్థలో వాటాలు ఉన్న నేపధ్యంలో ఇవన్నీ కలుపుకుంటే రామ్ చరణ్ ను మించిన శ్రీమంతుడు టాలీవుడ్ లో ఎవరున్నారు అంటూ మెగా అభిమానులు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఫోర్బ్స్ పత్రిక సాంకేతిక పరంగా చేసిన పొరపాట్ల వల్ల చరణ్ కు ఈ పత్రిక ర్యాంకింగ్స్ లో స్థానం మిస్ అయిందని మెగా అభిమానుల వాదన. 

అంతేకాదు ఫేమ్ కు సంబంధించి పవన్ ను మించి పాపులారిటీ ఉన్న టాప్ హీరో టాలీవుడ్ లో ఎవరు ఉన్నారు అంటూ మెగా అభిమానులు ఫోర్బ్స్ పత్రిక ఇచ్చిన ర్యాంకింగ్స్ పై ఘాటైన సెటైర్లను మెగా అభిమానులు వేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ ప్రస్తుతం మెగా అభిమానులకు తీవ్ర నిరాశను కల్గిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: