‘సోగ్గాడే చిన్ని నాయన’ ఇచ్చిన సూపర్ సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్న నాగ్ తన పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈశ్రద్ధలో  నాగార్జున ఎక్కువగా తన పెద్ద కొడుకు నాగచైతన్య కెరియర్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అఖిల్ సినిమా విడుదలై నాలుగు నెలలు గడిచినా అఖిల్ రెండవ సినిమా గురించి నోరు విప్పని నాగ్ నాగచైతన్య సినిమాల విషయంలో తన స్పీడ్ ను విపరీతంగా పెంచాడు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

అఖిల్ తో పోలిస్తే నాగచైతన్య కెరియర్ ఇప్పుడు చాలా స్పీడ్ గా వెఉండటమే కాకుండా చైతూ సినిమాలకు బయ్యర్లలో క్రేజ్ ఏర్పడిన నేపధ్యంలో ఆ క్రేజ్ ను పూర్తిగా వినియోగించుకోవడానికి నాగార్జున ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా  తనకు ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణతో నాగచైతన్య తర్వాత సినిమాను ఫిక్స్ చేసాడు నాగార్జున. 

అంతేకాదు ఈ సినిమా కథ విషయంలో కూడ నాగ్ అన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్నాడని టాక్. అయితే ఈ విషయమై నాగార్జున సన్నిహితులు మరోవిధంగా కామెంట్ చేస్తున్నారు. అఖిల్ కు ఉన్న స్టార్ మెటీరియల్ రిత్యా ఒక్క హిట్ పడితే అఖిల్ కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అయితే నాగచైతన్య కెరియర్ ఇంకా స్లోగా నడుస్తున్న నేపధ్యంలో మొదటి ప్రాధాన్యత నాగ్ చైతూకే ఇస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. 

అంతేకాకుండా కథల ఎంపికలో అఖిల్ కి ఉన్న మెచ్యురిటీ చైతన్యకు లేదు అనే అభిప్రాయoలో నాగార్జున ఉన్న నేపధ్యంలో చైతన్యకు సంబంధించిన కథలను వినే బాధ్యతను కూడ నాగ్ తీసుకుంటున్నాడు అనే కామెంట్స్ కూడ ఉన్నాయి. నాగార్జున నమ్మకాన్ని చైతన్య ఈ సమ్మర్ కు విడుదల కాబోతున్న ‘ప్రేమమ్’ సినిమాతో ఎంత వరకు నిలబడతాడో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: