క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ చేసిన ట్విట్ అల్లు అర్జున్ తో పాటు బన్నీ అభిమానులను కూడ తీవ్ర గందరగోళంలో పెట్టింది అన్న వార్తలు వస్తున్నాయి. అసలు ఈ ట్విట్ కు అల్లుఅర్జున్ ‘సరైనోడు’ సాంగ్ లీక్ కు ఎటువంటి సంబంధం లేకపోయినా ‘సరైనోడు’ సాంగ్ లీకైనట్లు ప్రతి చోటా వార్తలు వినిపించాయి. 

బన్నీ అభిమానులకు కానీ అతడి వ్యతిరేకులకు కాని ఎక్కడా ఫేస్ బుక్ లో కాని ట్విట్టర్ లో కాని ఇదే ‘సరైనోడు’  లీక్డ్  సాంగ్ అంటూ ఒక్క లింక్ కూడ కనిపించలేదు. జరుగుతున్న ఈహడవిడిని చూసి ఈసినిమా నిర్మాతలు ‘సరైనోడు’ లీక్డ్ సాంగ్ ను డౌన్లోడ్ చేసినా, చూసినా నేరం.. కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసారు. 

ఈ సాంగ్ లీక్ అయినట్లు ఎక్కడా కనిపించకపోయినా ఈ రేంజ్ లో  ప్రెస్ నోట్ ఇవ్వడం చూస్తుంటూ కావాలనే పబ్లిసిటీ స్టంటులో భాగంగా ఈ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయానికి రకుల్ ప్రీత్ ట్విట్ కారణం అంటూ ఒక ఆసక్తికరమైన ఒక విషయం వెలుగులోకి వచ్చింది. రకుల్ తన ట్విట్ లో ఒక పాట గురించి అభిప్రాయం వ్రాస్తూ  ‘మెలోడీ బాగుంది’ అనే కామెంట్ చేసింది. 

దీనితో రకుల్ కామెంట్ చేసింది ‘సరైనోడు’ సాంగ్ గురించే అంటూ మరికొందరు హడావిడి చేసారు. అయితే ఈ పాట ఎక్కడా లీక్ అయిన దాఖలాలు కనిపించకపోయినా ‘సరైనోడు’ సినిమా ఒకేసారి నెట్ వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే ఈసినిమా కథ పెద్ద గొప్పగా మరియు కొత్తగా లేదనే వార్తలు వస్తున్న నేపధ్యంలో అసలు ఎక్కడా పాట లీక్ కాని విషయమై ఇంత రచ్చ ఎందుకు జరిగిందో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: