తెలుగు ఇండస్ట్రీలోకి ‘సూపర్’ చిత్రంతో అక్కినేని నాగార్జున సరసన హాట్ హాట్ గా ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరి బ్యూటీ అనుష్క తర్వాత అగ్ర హీరోల సరసన నటిస్తూ.. తక్కువ టైమ్ లోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి చిత్రం అనుష్క కెరీర్ లో మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. ఈ చిత్రంలో జేజమ్మగా అనుష్కక నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి..అంతే కాదు ఇండస్ట్రీలో స్టార్ డమ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తర్వాత అనుష్క కేవలం గ్లామర్ ప్రాధాన్యత పాత్రలు మాత్రమే కాదు ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేసి మెప్పించగలదు అన్న పేరు పడిపోయింది. ఆ తర్వాత పంచాక్షరి, రుద్రమదేవి, సైజ్ జీరో చిత్రాల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించి మెప్పించింది.  


అంతా బాగుంది కానీ.. అనుష్క గత మూడు నెలలుగా అసలు ఏమైందీ అన్న ప్రశ్న ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..? సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ అయిన ఓ స్టార్ హీరోయిన్ మూడు నెలలుగా ఎక్కడా కనిపించకపోతే ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిపోయింది.  ‘సైజ్ జీరో’ విడుదలకు ముందు ప్రమోషన్లలో కనిపించడమే ఆఖరు. ఆ తర్వాత అనుష్క ఎక్కడా దర్శనమిచ్చింది లేదు. ‘బాహుబలి-2’ కోసం తాను చాలా బరువు తగ్గాల్సి ఉందంటూ చివరగా ఇంటర్వ్యూలో చెప్పిన విషయం మాత్రం తెలుసు. అనుష్క ప్రయోగాత్మక చిత్రాల్లో ‘సైజ్ జీరో’ ఒకటి అయితే ఈ చిత్రం గురించి అనుష్క పెద్ద సాహసమే చేసింది...తన బరువు విపరీతంగా పెంచేసింది దీంతో అనుష్క ఒక ఆంటీలా తయారైంది.

అనుష్క


ఎంతో గ్లామర్ గా కనిపించే అనుష్క ఒక్కసారే అలా కనిపించే సరికి హీరోలు సైతం ముక్కున వేలేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రాధాన్యత ఉన్న ప్రపంచం అలాంటిది ఇలా ఆంటీలా తయారైతే తర్వాత చిత్రాలు ఏమిటా అన్న ప్రశ్న వచ్చింది. దీంతో అనుష్క పూర్వపు స్థితి తెచ్చుకోవడం కోసం తెగ తంటాలు పడుతున్నట్లు తెలుస్తుంది..అంతే కాదు రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి 2’ లో అనుష్క ప్రధాన పాత్ర వహించబోతుంది. ఇలాంటి సమయంలో అనుష్క తన భారీకాయంతో నటించడం కష్టం అందుకే వీలైనంత తొందరగా సన్నబడటం కోసం అనుష్క కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.  ఆల్రెడీ ‘బాహుబలి-2’ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ సహా ప్రధాన పాత్రధారుల మీద సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు జక్కన్న. అనుష్క నేరుగా అక్కడికి వెళ్లిపోయి ఈ షూటింగ్ లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరచనుందా..!


మరింత సమాచారం తెలుసుకోండి: