తెలుగు చిత్రాలు ఎన్నో ఇప్పటి వరకు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి..డబ్బింగ్ అయ్యాయి. అయితే టాలీవుడ్ లో సాధించిన విజయాలు మాత్రం అక్కడ అందుకోలేక పోయాయి. వాస్తవానికి రిమేక్ చిత్రాలు సినిమా ఇండస్ట్రీలో కామన్..కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలు సాధిస్తే..కొన్ని చిత్రాలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి హిందీలో నటించిన విషయం తెలిసిందే..అయితే మెగాస్టార్ కి ఇక్కడ ఎంత పేరున్నా హిందీలో విడుదలైన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి..ఈ మద్య ఆయన తనయుడు రాంచరణ్ నటించిన జంజీర్ చిత్రం కూడా ఘోర పరాజయం అయ్యింది. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ చిత్రం కూడా హిందీలో విడుదల కాబోతుంది.


తెలుగులో బారీగా విడుదలకానున్న ఈ సినిమా హిందీలో కూడా విడుదలకానుంది. భారీ రేట్ కు హిందీ శాటిలైట్ హక్కులు అమ్ముడుపోవడంతో బాలీవుడ్ లోనూ ఈ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తుందని అందరూ బావిస్తున్నారు. బాలీవుడ్ జనాలకు గబ్బర్ సింగ్ పేరు బాగా పరిచయం ఉండటంతో ఈ సినిమా ఈజీగా జనాల్లోకి వెళుతుందని అనుకుంటున్నారు. అయితే ఈరోస్ సంస్థ వల్ల సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ లో తేడా వస్తుందా అని కొంత మంది చర్చిస్తున్నారు. మరోవైపు ఈరోస్ ఇంటర్నేషనల్ హింది గబ్బర్ సింగ్ కు భారీగా ప్రచారం చేస్తోందట.  ఇప్పటికే తెలుగులో భారీ స్థాయిలో ప్రచారం మొదలు పెట్టిన సర్ధార్ బాలీవుడ్ లో కూడా అంతకన్న ఎక్కువ ప్రచారం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..అంతే కాదు దీనికోసం అక్కడ ప్రముఖ హీరోతో కూడా ప్రచారం చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

సర్ధార్ గబ్బర్ సింగ్ పోస్టర్



ఇప్పటికే ఈ చిత్రంపై అమితాబచ్చన్, సల్మాన్ ఖాన్ ప్రశంసలు కురిపించినా...గతంలో మెగాస్టార్ చిరంజీవి, ఈ మద్య ఆయన తనయుడు రాంచరణ్ నటించిన చిత్రాలు పెద్దగా ఆకర్షించలేదు..అదే తరహాలో పవన్ సినిమా కూడా పరాభవం అవుతుందా అన్న ఆలోచనలో ఈరోస్ సంస్థ ఆలోచించిన్టుల తెలుస్తుంది. అందుకే ఈరోస్ ఇంటర్నేషనల్ హింది గబ్బర్ సింగ్ కు భారీగా ప్రచారం చేస్తోందట. బాగా ప్రచారంచేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారట.

‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ చిత్రం పోస్టర్


అయితే ఇలా అతిగా చేసే ప్రచారం కూడా కొంప ముంచే అవకాశాలున్నాయని కొంత మంది అనుకుంటున్నారు. మరోవైపు ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ చిత్రం బాహబలి రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తుంది..అలా అయితే బాలీవుడ్ లో సర్ధార్ బాక్సాఫీస్ విజయం సాధించాలన్నమాట. ఏది ఏమైనా బాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ ఫస్ట్ టైమ్ అడుగు పెట్టుబోతున్నాడు..మరి విజయాన్ని చవిచూస్తాడా..లేదా అన్నదే ప్రశ్న. 


మరింత సమాచారం తెలుసుకోండి: