తెలుగు తెరపైకి మెగాస్టార్ వారసులుగా ఇప్పటికే చాలా మంది హీరోలు గా వచ్చారు..అయితే మెగాస్టార్ మేనల్లుడు..స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున గంగోత్రి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పెద్దగా పేరు రాకపోయినా..తర్వాత వచ్చిన బన్ని, ఆర్య,దేశముదురు చిత్రాలతో తిరుగులేని విజయాన్ని అందుకోవడమే కాకుండా మాస్ ప్రేక్షకుల అభిమానం బాగా సంపాదించాడు.  నటనలో తనదైన ఒరవడి సృష్టించాడు. స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు.మెగాస్టార్ చిరంజీవి వారసులుగా వచ్చి వీరిలో సమాజ సేవ కూడా బాగానే అలవడింది..ఎందుకంటే ఇప్పటికే మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్స్, ఐ బ్యాంక్స్ అంటూ ఎన్నో స్వచ్చంద పనులు చేస్తూ సమాజ సేవలో తనకంటూ ఓ ముద్ర వేశారు.

తన అభిమానితో మాట్లాడుతున్న బన్ని


ఇదే బాటలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వెళుతున్నారు.  ఇన్నాళ్లూ అల్లు అర్జున్ చేసిన గుప్తదానాలు అందరికీ తెలుస్తున్నాయి. మెగా అభిమానులు ఎవరు చనిపోయినా.. ఎవరైనా కష్టాల్లో ఉన్నా.. అల్లు అర్జున్ అభిమానుల ఇంటికి వెళ్తున్నారు. వాళ్లకు సహాయం చేస్తున్నారు. తాజాగా నూర్ అహ్మద్ అనే అభిమానికి అల్లు అర్జున్ లక్ష రూపాయలు సహాయం చేశారు. అతడి పిల్లల చదువుకు అవసరమైన డబ్బులనూ సమకూరుస్తున్నారు.

అహ్మద్ కుటుంబ సభ్యలతో అల్లు అర్జున్


అనకాపల్లిలో పైడిరాజు అనే చిరు అభిమాని అకాల మరణం చెందారు. గాజువాకలో అప్పలనాయుడు అనే అభిమాని కూడా మరణించారు. ఇరువురి కుటుంబ సభ్యులకు చెరో లక్ష రూపాయల చొప్పున సహాయం చేశారు. అప్పలనాయుడు ముగ్గురి పిల్లలను దత్తత తీసుకున్నారు.

చెక్ అందిస్తేన్న అల్లు అర్జున్

జీవితాంతం వాళ్ల చదువులకు అవసరమయ్యే ఖర్చును భరిస్తానని బన్నీ చెప్పారు. ఇలా కేవలం నటుడిగా అభిమానులనుఅలరించే అల్లు అర్జున్ గా కాకుండా ప్రజలకు తన వంతు సేవలు అందిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నందుకు నిజంగా బన్ని సరైనోడు అనొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: