తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఒక నటుడు ఎన్ని పాత్రల్లో చేయగలరో అన్ని పాత్రల్లోనూ చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. పౌరాణిక,జానపద,సాంఘిక చిత్రాలో ఎన్నో అద్భుతమైన పాత్రలు వేసి ఎన్టీఆర్ మెప్పు పొందారు. దర్శకరత్న దాసరి నారాయణ రావుకి ప్రియ శిశ్యుషుడిగా ఆయన దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో నటించారు మోహన్ బాబు. విలన్ గా చేస్తూనే హీరోగా నటిస్తూ కొన్ని చిత్రాలు స్వియదర్శకత్వం వహించారు. ఆయన నటించిన అల్లుడుగారు చిత్రం మోహన్ బాబు కెరీర్ పెద్ద మలుపు తిప్పింది. ఆనాటి నుంచి విలన్ వేషాలు మానేసి హీరోగా సెటిల్ అయ్యారు. మోహన్ బాబు కెరీర్ లో మరో అద్భుతమైన చిత్రం ‘అసెంబ్లీ రౌడి’.

అందాల తార స్వర్గీయ దివ్యభారతి నటించిన ఈ చిత్రం అప్పట్లో విపరీతమైన కలెక్షన్లు సాధించింది..దీంతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టాలీవుడ్ మంచి పేరు సంపాదించారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఆ చిత్రం విడుదలై శనివారంతో పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం దర్శకుడు బి. గోపాల్ , రచయిత పరుచూరి గోపాలకృష్ణతో కలిసి మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నారు.తిరుపతి దగ్గర తిరుచానూర్ లో క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఓ ఐదుగురు కాంగ్రెస్ వాళ్లు వచ్చి గొడవ చేసి, మాకు భద్రతగా ఉన్న ఓ కానిస్టేబుల్ ను కొట్టబోతే, చేతిలో ఉన్న కత్తితో తరిమా. వాళ్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించాం.

సినిమా రిలీజయ్యాక అసెంబ్లీ రౌడీ అనే టైటిల్ పెట్టానని అసెంబ్లీలో మూడు రోజుల పాటు గొడవ చేసారు. సినిమా నిషేధించాలన్నారు. నా కటౌట్లు ధ్వంసం చేశారు. తీరా స్పీకర్ గారు ఈ సినిమా చూసి అబ్జెక్ట్ చెయ్యాల్సింది ఏమీ లేదన్నారు' అని ఆనాటి ఘటనలను మోహన్ బాబు వివరించారు. ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.  తాజాగా ఈ చిత్రాన్ని మంచు విష్ణుతో రిమేక్ చేయాబోతున్నట్లు డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రకటించారు. అప్పట్లో ఈ చిత్రం ఎంతో విజయవంతం అయ్యింది..ఇప్పుడు మంచు విష్ణు తండ్రి స్థాయిలో నటించి మెప్పించగలడా అనేది వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: