తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. తర్వాత ఆ ప్రోగ్రామ్ కి గుడ్ బాయ్ చెప్పగా ఆమె ప్లేస్ లో రేష్మీ గౌతమ్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు కూడా తన సీనియర్ కి ఏమాత్రం తీసిపోకుండా విపరీతమైన ఎక్స్ పోజింగ్, హాట్ హాట్ గా యాంకరింగ్ చేస్తూ అందరికీ ఆకర్షించింది. దీంతో రేష్మీకి కూడా విపరీతమైన క్రేజ్ రావడంతో టాలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గుంటూర్ టాకీస్ సినిమాలో రేష్మీ పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయింది..కానీ సినిమా మాత్రం చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. తాజాగా ఈ అమ్మడు ‘అంతం’ సినిమాలో హీరోయిన్ గా వస్తుంది. అయితే పూర్తి స్థాయిలో థ్రిల్ల్ , హర్రర్, సస్పెన్స్ నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రంలో రేష్మీ విపరీతంగా రెచ్చిపోయిందట.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ చూస్తుంటే..రేష్మీ లుక్స్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఇక టాలీవుడ్ లో తనకంటూ మంచి పేరు రావాలని టాప్ హీరోయిన్ లీస్టు లో చేరిపోవాలని రేష్మీ గత కొంత కాలంగా పరితపిస్తుంది.  వాస్తవానికి జబర్ధస్త్ షో కంటే ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు..కానీ ఈ కామెడీ షో తర్వాత రేష్మీకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. అంతే కాదు ఇతర ఆడియో ఫంక్షన్లలో, వేరే చానల్స్ లో యాంకర్ గా చేస్తూ బాగా పాపులర్ అయ్యింది. ఒక దశలో చెప్పాలంటే తన సీనియర్ అనసూయ కంటే అతి తక్కువ కాలంలోనే  హాట్ బ్యూటీగా పేరు సంపాదించింది.  ఇక అంతం చిత్రంతో మరోసారి  ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మీ గౌతమ్.

జూలై 7నే అంతం మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో అందాల ఆరబోతతో  చక్కని పర్ఫామెన్స్ చూపిస్తుంది రేష్మి. ట్రైలర్.. ప్రోమోలు ప్రామిసింగ్ గానే కనిపిస్తున్నాడు. దర్శక నిర్మాతలు కూడా రష్మీ అందాలనే పెట్టుబడిగా పెట్టారనిపిస్తుంది. గుంటూరు టాకీస్ తర్వాత.. అంతంతో కూడా ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకురాగలిగితే.. హాట్ రోల్స్ కి రష్మీ కేరాఫ్ అడ్రస్ అయిపోవడం ఖాయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: