కొని రోజులుగా కోలీవుడ్ దర్శకుడు విజయ్ హీరోయిన్ అమలాపాల్ లు డైవర్స్ తీసుకుంటున్నారు అని హడావిడి చేస్తున్న వార్తల పై దర్శకుడు విజయ్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చాడు. మీడియాలో వస్తున్న వార్తల వల్ల తన కుటుంబం తీవ్ర మనోవేదనకు గురి అవుతోందని చెపుతూ అమలాపాల్ కెరియర్ ను ఆమె అత్తమామలు చంపేస్తున్నారు అనే వార్తలో ఏ మాత్రం నిజం లేదు అంటూ దర్శకుడు విజయ్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు.

డైవర్స్ విషయమై తాము విడిపోతున్న వార్తలు నిజమే అని అంటూ అలా విడిపోవడానికి గల కారణం ఏమిటో తనకు మాత్రమే తెలుసు అని అంటూ తామిద్దరం విడిపోతామని కలలో కూడా ఊహించుకోలేదు అని అంటున్నాడు విజయ్. అంతేకాదు భార్యాభర్తలు విడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయని ఆ కారణాల గురించి లోతుగా విశ్లేషణలు చేస్తూ ఇది ఒక జాతీయ సమస్యలా తమ పై మీడియా ఎందుకు వార్తలు రాస్తోందో తనకు అర్ధం కావడం లేదు అంటూ మీడియాను టార్గెట్ చేసాడు విజయ్.

తన తండ్రి ఒక టిపికల్ ఫాదర్ అని చెపుతూ మీడియాలో ఛానల్స్ లో వస్తున్న వార్తలు చూసి ఆవేశంతో అనాలోచితంగా అమలాపాల్ గురించి మాట్లాడిన విషయాలు ఏ మాత్రం నిజం కాదని తామిద్దరం విడిపోవడానికి గల కారణాలు తమకు మాత్రమే తెలుసు అని అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు విజయ్. దయచేసి ఇది మా కుటుంబ విషయం  దాన్ని గౌరవించండి. మా పర్శనల్ స్పేస్ మాకు వదలండి రూమర్స్ ప్రచారం చేయవద్దు అంటూ తప్పనిసరి పరిస్దితుల్లో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అంటున్నాడు విజయ్. 

ఇది ఇలా ఉండగా కోలీవుడ్ హీరోలు చాలామంది అమలాపాల్ కు జరిగిన పరాభవాన్ని సీరియస్ గా తీసుకుని అమలాపాల్ కు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చి తిరిగి ఆమెను ప్రోత్సహించాలి అన్న నిర్ణయంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: