రాజమౌళి దర్శకత్వంలో  రూపొందుతున్న  ‘బాహుబలి 2’ విడుదల గురించి ఆసక్తిగా ఎందరో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలసుకోవడానికైనా చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు  ఈ రోజు ఒక షాకింగ్ న్యూస్ ను కరణ్ జోహార్ బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.

‘బాహుబలి 2’  2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు కరణ్‌ జోహార్ ‘బాహుబలి’ అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు ఈసినిమా 2017 ఏప్రియల్ 14న విడుదల అవుతుంది అని రాజమౌళి సంకేతాలు ఇస్తూ వచ్చాడు. దీనికి కారణం ఆరోజు ‘ఉగాది’ పండుగ కావడంతో సెంటిమెంట్ గా బాగుటుంది అని రాజమౌళి ఆ డేట్ ను ఎనౌన్స్ చేసాడు. 

అయితే ఇప్పుడు ఇలా హఠాత్ గా కరణ్ జోహార్ రంగంలోకి దిగి ‘బాహుబలి’ రిలీజ్ డేట్ ను రాజమౌళి కాకుండా కరణ్ జోహార్ ఎనౌన్స్ చేయడం అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా ఇలా కరణ్ జోహార్ ప్రకటించడం వెనుక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా ? అన్న చర్చలు జరుగుతున్నాయి. ‘బాహుబలి 2’ ఇంటర్నేషనల్ మార్కెట్ బిజినెస్ అంతా కరణ్ జోహార్ సలహాలతో జరుగుతున్న నేపధ్యంలో ‘బాహుబలి 2’ ప్రాజెక్ట్ విషయమై తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఇలా కరణ్ జోహార్ వ్యవహరించాడా ? అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.

చైనాలో ‘బాహుబలి’ పరాజయం చెందిన తరువాత రాజమౌళి ‘బాహుబలి 2’ నిర్మాణ విషయమై కొన్ని మార్పులు చేయాలి అని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందీ. ఈ నేపధ్యంలో మళ్ళీ ‘బాహుబలి  2’ రిలీజ్ ఎక్కడ వాయిదా పడుతుందో అన్న ఉద్దేశ్యంతో రాజమౌళి ఆలోచనలకు అడ్డుకట్ట వేయడానికి కరణ్ జోహార్  ఇలా వ్యవహరించి ఉంటాడు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: