గ్లామర్ పాత్రలకు పక్కనబెట్టి ప్రయోగాత్మక పాత్రల్లో ఎవరూ నటించలేదు. పాత తరం హీరోయిన్లు కొంత మంది కూరూపిగా నటిస్తూ అప్పట్లో డీ గ్లామర్ పాత్రలు పోషించారు. కానీ ఇప్పటి హీరోయిన్లు మాత్రం అలాంటి పాత్రల్లో నటించలేదు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక్క హీరోయిన్ మాత్రం ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ ఔరా అనిపిస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా..! సూపర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ అనుష్క. ఇప్పటికే అరుంధతి, రుద్రమదేవి,పంచాక్షరి,సైజ్ జీరో లాంటి చిత్రాల్లో నటించిన అనుష్క తాజాగా ఓం నమో వెంకటేశాయ చిత్రంలోని కృష్ణమ్మ గా నటిస్తుంది.

ఈ మద్య ఆ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫోటోలో కనిపిస్తుంది చిన్నారి అనుష్క. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా హీరోయిన్ అనుష్క వెరైటీగా స్పందించింది. సాదాసీదాలా కాకుండా తన చిన్ననాటి ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి వావ్ అనిపించింది. అనుష్క ఇలా ఫ్రెండ్‌షిప్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవడం విశేషమే మరి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: