జూనియర్ ఎన్టీఆర్ మంచు మనోజ్ పుట్టినరోజు ఒకేరోజు వస్తుంది. అదేవిధంగా వారి ఇద్దరి భార్యల పేర్లు కూడ ఒకటే కావడం యాదృచ్ఛికం. దీనికితోడు మంచు మనోజ్ జూనియర్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో వీరిద్దరూ ఎక్కడైనా కలిసినప్పుడు ఒకరి పై ఒకరు జోక్స్ వేసుకుంటూ ఉంటారు. మనోజ్ ను జూనియర్ ఒకానోక సందర్భంలో కోతి అని పిలిచాడు అంటే వీరిద్దరి మధ్యా ఎంత సాన్నిహిత్యం ఉందో అర్ధం అవుతుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మనోజ్ కు ఈమధ్య ఒక విచిత్రమైన ప్రశ్నను ఒక నెటిజన్ అడిగాడు. ‘అన్నా నీకు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం’ అన్న ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్ సమాధానం ఇస్తూ ‘నా ప్రాణం లేక్కచేయనంత’ అంటూ సమాధానం ఇచ్చాడు.  అయితే ఈ సమాధానం జూనియర్ అభిమానులకు విపరీతంగా నచ్చడంతో మనోజ్ సమాధానాన్ని ఒకరికొకరు జూనియర్ అభిమానులు షేర్ చేసుకుంటున్నారు.

మోహన్ బాబు కు చిరంజీవికి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా అవేమి పట్టించు కోకుండా రామ్ చరణ్ మనోజ్ లు చాల సన్నిహితంగా కూడ ఉంటారు. అటు జూనియర్ తో ఇటు చరణ తో మనోజ్ సన్నిహితంగా ఉండటమే కాకుండా ఆ టాప్ యంగ్ హీరోల అభిమానులు తన అభిమానులుగా మార్చుకోవడానికి మనోజ్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు.  

అంతేకాదు ఈ మంచు హీరో అవకాశం వస్తే తాను జూనియర్ చరన్ లతో కలిసి నటించడానికి రెడీ అని ఇప్పటికే అనేక సార్లు ఓపెన్ గా సంకేతాలు ఇచ్చాడు. అయితే జూనియర్ రామ్ చరణ్ లు మాత్రం ఎందుకో ఈ విషయం పై పెద్దగా శ్రద్ధ పట్టడం లేదు అన్నది ఓపెన్ సీక్రెట్. 

ఈమధ్య కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోల మధ్య ఇగో సమస్యలు బాగా పెరిగి పోతున్న నేపధ్యంలో మంచు మనోజ్ ఇలాంటి ఇగోలు ఏమి పెట్టుకోకుండా జూనియర్ పై తనకు ఉన్న అభిమానాన్ని ఇలా వ్యక్త పరచడం ఒక మంచి పరిణామం అనుకోవాలి.  తన తండ్రి మోహన్ బాబు వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాలలో నటిస్తూనే అందరి హీరోల అభిమానాన్ని పొందే అందరి వాడుగా మారాలని మనోజ్ తాపత్రయ పడుతున్నాడు అని చేప్పడానికి ఈ ట్విట్ ఒక ఉదాహరణ.
 

ఈమధ్య కాలంలో వరస పరాజయాలతో సతమతమౌతున్న మనోజ్ తన లుక్ ను మార్చుకుని ప్రస్తుతం విశాఖ పట్టణం దగ్గర ఉన్న అరకు ప్రాంతంలో ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా చేసుకుని నిర్మింప బడుతున్న సినిమాలో నటిస్తూ తిరిగి క్రేజ్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే..



మరింత సమాచారం తెలుసుకోండి: