‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న సస్పెన్స్ కు తెర తీస్తూ ఈమధ్య రాజమౌళి ఈ విషయానికి సంబంధించిన సీన్స్ ముక్కలు ముక్కలుగా షూట్ చేసిన విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది.  అయితే ఈ విషయమై ఒక ఆ సక్తికర విషయాన్ని ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక చాల ప్రముఖంగా ప్రచురించింది.

ఆ పత్రిక కధనం ప్రకారం ‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న విషయాన్ని రాజమౌళి నాలుగు వెర్షన్స్ గా షూట్ చేసాడట.  ఇప్పుడు ఈ నాలుగు వెర్షన్స్ ను తన సన్నిహితులకు చూపెడుతూ ఏ వెర్షన్ ను ఫైనల్ చేయాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చాడు అని ఆ పత్రిక వార్తలు రాస్తోంది.  

మరొక ముఖ్య విషయం ఏమిటంటే ‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపవలసి వచ్చింది అన్న విషయం పై ఇప్పటికీ రాజమౌళి ఒక స్పష్టమైన క్లారిటీకి  రాలేదు అని ఆ జాతీయ మీడియా పత్రిక కథనం.  దీనితో ఈ నాలుగు వెర్షన్స్ ను సరి పోలుస్తూ ఈ సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేయబోతున్న కరణ్ జోహార్ తోను అదేవిధంగా ఈసినిమాకు కథను అందించిన తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తోను ఇంకా లోతుగా చర్చించి ఆ తరువాత మాత్రమే ఈ 4 వెర్షన్స్ లో ఏది బెటర్ అనే విషయం పై ఒక నిర్ణయానికి రావాలని రాజమౌళి ఆలోచన అని టాక్.

ఈ అంశం పైనే ‘బాహుబలి 2’ కథకు గుండెకాయగా మారుతుంది కాబట్టి వందల కోట్ల వ్యాపారంతో ముడిపడి ఉన్న ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం ఇష్టం లేక రాజమౌళి ఇలా ‘బాహుబలి’ హత్యను 4 వెర్షన్స్ లో చిత్రీకరించి ఆ సీన్స్ లో నటించిన ప్రభాస్ సత్యరాజ్ లకు కూడ షాక్ ఇచ్చినట్లు టాక్.  దీనితో ఈ విషయానికి సంబంధించి బయటకు లీక్స్ రాకుండా కూడ రాజమౌళి చాల వ్యుహాతంకంగా ఎత్తుగడలు వేశాడా ? అని అనిపిస్తుంది.

ఈ వార్తలు ఇలా ఉండగా అక్టోబర్ 15, 16 తారీఖులలో గోవాలో జరగబోయే బ్రిక్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భారత్ తరపున ప్రదర్సించే సినిమాల లిస్టులో ‘బాహుబలి’ స్థానం సంపాదించింది.  బ్రిజిల్ రష్యా చైనా దక్షిణాఫ్రికా ఇండియాల నుంచి ప్రతి దేశం నుండి ఎంపిక కాబడిన 4 చిత్రాలను మాత్రమే ఈ బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శిస్తారు.

మన భారత దేశానికి సంబధించి ఎంపిక కాబడ్డ 4 సినిమాలలో ‘బాహుబలి’ ఒకటి కావడం రాజమౌళి సత్తాను సూచిస్తోంది.  ఇప్పటికే ‘బాహుబలి 2’ క్లైమాక్స్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీస్తున్న రాజమౌళి ఉత్సాహానికి ఈ బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: