ఈరోజు ఉదయం విడుదలైన ‘జనతా గ్యారేజ్’ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్ కలలు కన్న 100 కోట్ల కలక్షన్స్ మార్క్ అందుకోవడం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి.  ఈసినిమాలో జూనియర్ అద్భుత నటనకు అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నా ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో క్లైమాక్స్ దగ్గరకు వచ్చే సరికి తేలిపోయింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

దీనితో ఈసినిమా యావరేజ్ హిట్ గా మాత్రమే మిగులుతుందని బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ‘జనతా గ్యారేజ్’ కి లేవు అన్న ప్రచారం అప్పుడే మొదలై పోయింది.  అయితే జూనియర్ ప్రియ స్నేహితుడు బాహుబలి సృష్టికర్త రాజమౌళి మాత్రం ఈసినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తునాడు.  అంతేకాదు తాను అప్పుడే వరసగా రెండుసార్లు ఈ సినిమాను ఈ రోజే చూసాను అంటూ ట్విట్ చేసి జూనియర్ అభిమానులకు జోష్ ను ఇచ్చాడు.  

‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా నుండి ప్రారంభమైన వీరిసాన్నిహిత్యం రోజురోజుకు పెరిగిపోతూ ఉండటమే కాకుండా రాజమౌళిని  ‘జక్కన్న’ అని జూనియర్ చేత పిలుపించు కునే  స్థాయికి వీరిద్దరి స్నేహం పెరిగి పోయింది.  జూనియర్ కు కెరియర్ బ్రేక్ ఇచ్చిన ‘సింహాద్రి’.  తారక్ కెరియర్ పరంగ సమస్యాలలో ఉన్నప్పుడు అతడి లుక్కును మర్చి ‘యమదొంగ’ గా చూపెట్టి జూనియర్ కు మరో కెరియర్ బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి.

ఇప్పుడు మళ్ళీ జూనియర్ కలలు కంటున్నా కలక్షన్స్ డ్రీమ్ ను నిజం చేయడానికి రాజమౌళి తన వంతు సహకారంగా ‘జనతా గ్యారేజ్’ మూవీని ఈరోజు రెండు సార్లు చూసి తన ప్రశంసలతో ట్విట్స్ పెట్టాడు.  జూనియర్ ‘టెంపర్’ సినిమా నుండి తన పాత్రల ఎంపిక విషయంలో చాల అద్భుతంగా వ్యవహరిస్తున్నాడు అని అంటూ ‘జనతా గ్యారేజ్’ లో జూనియర్ మోహన్ లాల్ కాంబినేషన్ మరియు వారిద్దరి నటన అదుర్స్ అని అంటున్నాడు.

ఇక రాజీవ్ కనకాల ఈ సినిమాలో ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ గా అద్భుతమైన నటన కనపరిచాడు అంటూ రాజీవ్  పై కూడ ప్రశంసల వర్షం కురిపించాడు రాజమౌళి.  అయితే ఒక సామాన్యమైన జూనియర్ వీరాభిమానిలా రాజమౌళి ‘జనతా గ్యారేజ్’ ని ఒకేరోజు రెండు సార్లు చూడటమే కాకుండా ఈసినిమాను ప్రమోట్ చేస్తున్న నేపధ్యంలో రాజమౌళి ట్విట్ ఈసినిమాకు వచ్చిన డివైడ్ టాక్ ను ఎంత వరకు పాజిటివ్ టాక్ మారుస్తుందో చూడాలి.

అయితే ఇటువంటి డివైడ్ టాక్ మొదట్లో తెచ్చుకుని కలక్షన్స్ విషయంలో సంచలనాలు సృష్టించిన ‘సరైనోడు’ ‘అ ఆ’ సినిమాల మాదిరిగా తన డివైడ్ టాక్ ను ఎంతవరకు కలక్షన్స్ ప్రభంజనంగా మార్చుకోగలదో ? లేదో ఆన్న విషయం ఈ వీకెండ్ తరువాత తేలిపోతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: