టాలీవుడ్ లో దర్శకుడు కృష్ణవంశీ ది ఒక విచిత్ర మైన స్థానం. ఆయన సినిమాలు జనం లోకి  వెంటనే వెళ్ళవు.‘సింధూరం’, ‘అంతఃపురం’, ‘రాఖి’ సినిమాలు రిలీజైనప్పుడు మొదట జనానికి అంతగా నచ్చలేదు. అంతే కాదు  ఈ సినిమా చూసిన వెంటనే ఇదేమి సినిమా అంటారు. తరువాత ఇదే సినిమాలను క్లాసిక్  అంటారు.

ఇక ఈ సినిమాలు టీవీలలో వస్తే కదలకుండా చూసేస్తారు. అదే అయన సినిమాల లోని మేజిక్. తినగ తినగ వేము తీయన అన్నట్లు గా కృష్ణ వంశి సినిమాలు నెమ్మది గా హిట్ అవుతాయి. కుటుంబ  బందాలు మానవతా విలువలు ఈయన  చూపించి నంతగా వేరే దర్శకుడు చూపించడు. సింధూరం సెకండ్ రిలీజ్ కు విజయవంతం అయ్యింది.

అంతపురం లో  హీరో లేడు  ఇదేమి  సినిమా అన్నారు. కానీ ‘అంతఃపురం’ సినిమాకు అవార్డులు వచ్చాయి, ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఇదే క్రియేటివ్ డైరెక్ట్ ర్ క్రిష్ణవంశి దర్శకత్వం వహించిన ‘పైసా’ సినిమా విషయంలోనూ జరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్ కు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చినా ఏరియా బిజినెస్ రీత్యా ఈ సినిమా వెనుకపడుతోందట. దీనికి ప్రధానకారణం ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ కావడంతో ఈ సినిమాను జిల్లాల వారిగా ఎక్కువ రేట్లకు కోడ్ చేస్తున్నారు. ప్రస్తుత సినిమాలన్నీ కేవలం మొదటి వారం ఓపెనింగ్స్ పైనే ఆధారపడుతున్న నేపధ్యంలో కృష్ణవంశి హీరో నానీల మేజిక్ ఈ సినిమాకు హెవీ ఓపెనింగ్స్ తెచ్చి పెట్టగలదా? అనే భయంతో బయ్యర్స్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్న విషయం పై క్లారిటీ రావడం లేదని అంటున్నారు....

మరింత సమాచారం తెలుసుకోండి: