తన అన్న మెగాస్టార్, తమ్ముడు పవర్ స్టార్ అయినా తాను ఏ స్టారూ కాలేక,  మెగా బ్రదర్ అన్న పిలుపుతో సరిపెట్టుకుంటున్నాడు నాగబాబు. అప్పుడప్పుడూ సినిమాలలో అతిథి పాత్రలు చేస్తూ, సీరియల్స్ లో నటిస్తూ  నాలుగు కాసులు వెనకేసుకుంటూ, టీవీ షోల్లో జడ్జిగా మెరుస్తూ కాలం గడుపుతున్నాడు నాగబాబు. అయితే ఈమధ్య ఇతగాడి మీద కూడా విమర్శలు బాగానే వస్తున్నాయి. జబర్దస్త్ షోలో యాంకర్ అనసూయ మీద మరీ ఎక్కువ ఆసక్తి చూపించాడని, ఆమెను తొలగించినందుకు అలిగి ఆ కార్యక్రమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడనీ కూడా వార్తలు వచ్చాయి.

ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యు లో ఆయన నోరు జారి అన్న ఓ మాట నాగబాబు మెడకు చుట్టుకుంది. ఆరెంజ్ సినిమా తీసి అప్పుల్లో కూరుకుని పోయానని, అన్నదమ్ములు ఆదుకోకపోతే ఆత్మహత్య చేసుకునేవాడినని ఓ ఎమోషనల్ డైలాగ్ విసిరాడు ఈ మధ్య.  ఓ చానల్ వారైతే మెగాబ్రదర్ సూసైడ్ స్టోరీ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసారు.

దాంతో ఏదో మామూలుగా  అంటే ఇంత రభస చేస్తారా అంటూ తల పట్టుకుంటున్నాడ. అనవసరంగా తను  నోరు జారానని, మామూలుగా చెప్పిన మాటను పట్టుకుని ఇంత యాగీ చేయడం అన్యాయమనీ వాపోతున్నాడు. ఇప్పుడెంత ఫీలయ్యి ఏం లాభం  అప్పు ఇచ్చేముందు, మాట చెప్పేముందు బాగా ఆలోచించాలి అని అంటారు పెద్దలు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నాగబాబు కి మంచి గడసరి అనే పేరుంది మరి ఆయన ఇలా మాట్లాడటం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. అందుకే పెద్దలు చెపుతారు నోరు జారితే తీసుకోలేము అని....

మరింత సమాచారం తెలుసుకోండి: