నిన్న విడుదలైన ‘ఓం నమో వేంకటేశాయ’ ట్రైలర్ అత్యంత అద్భుతంగా ఉందని భక్తిరస సినిమాగా ఈసినిమా హిట్ కొట్టడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి.  ఈమధ్య కాలంలో విపరీతంగా వస్తున్న కమర్షియల్ సినిమాల హడావిడి మధ్య ఈసినిమా ఒక డిఫరెంట్ సినిమాగా యూత్ ను కూడ టచ్ చేస్తుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

అక్కినేని నాగార్జున మరియు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కలసి అందిస్తున్న మరో సుందర దృశ్య కావ్యంగా ఈమూవీ మారడం ఖాయం అని అంటున్నారు.  ఎప్పటిలాగానే కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని విపరీతంగా ప్రేమించే ఒక భక్తుడు. ఆ భక్తుడ్ని ఇక్కట్లు పాలు చేయాలనుకునే కొందరు విలన్లు. వారు అతన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు దేవుడు కూడా అతనికి పరీక్ష పెట్టడం చివరికి అతనితో దేవుడు కలసిపోవడం. లోక సంరక్షణ దుష్ట సంహారం జరిగిపోవడం లాంటి మెయిన్ స్టోరీతో ఈసినిమా రాబోతోంది అన్న సంకేతాలు ఈ ట్రైలర్ ద్వారా ఇచ్చాడు.
 
హాథీ రామ్ బాబా కథను సెంట్రల్ ఎలిమెంట్ గా తీసుకుని వేంకటేశ్వరుడి లీలను అల్లుతు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన ప్రయోగం బాగా విజయవంతం అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. భక్తి పాత్రలకు నాగార్జునకు పోటీ లేదు అన్న విషయం ఈ ట్రైలర్ ద్వారా మరొకసారి రుజువైంది. 

హిందీ సినిమాల నటుడు సౌరభ్ వేంకటేశ్వరునిగా కనిపించి మెప్పించాడు. ఇతడిని చూస్తుంటే నిజంగానే కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని చూస్తున్నామా అని అనిపించే డట్లుగా ఉంది. 

అలాగే భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కూడా ఆకట్టుకుంది. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ఈ తీజర్ లో కనిపించినా ఈ ట్రైలర్ లో మరో ముఖ్య పాత్ర చేసిన జగపతిబాబు కనిపించక పోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. సంక్రాంతి పండుగ సినిమాల హడావిడి తరువాత ఫిబ్రవరిలో రాబోతున్న ఈమూవీ గ్యారెంటీ హిట్ అన్న పాజిటివ్ టాక్ ఇప్పటి నుంచే ప్రారంభం అయింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: