సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సాధించిన రికార్డులు ‘కాటమరాయుడు’ బయ్యర్లకు టార్చర్ గా మారింది అని వార్తలు వస్తున్నాయి.  ‘ఖైదీ’ సాధించిన కలక్షన్స్ రికార్డులను చూపెట్టి ‘కాటమరాయుడు’ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ సినిమాల మార్కెట్ రేంజ్ కు మించి చెపుతున్న రేట్లు ఈసినిమా హక్కుల కోసం పోటీ పడుతున్న బయ్యర్లకు చుక్కలు చూపెడుతున్నట్లు టాక్. 

‘సర్దార్ గబ్బర్ సింగ్’ పరాజయాన్ని లెక్కలోకి తీసుకోకుండా కేవలం ‘ఖైదీ’ కలక్షన్స్ ను మాత్రమే ‘కాటమరాయుడు’ బయ్యర్లకు ఉదాహరణగా చూపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈమూవీని మార్చి నెలాఖరున వచ్చే ఉగాది రోజున కాకుండా మార్చి 24న విడుదల చేస్తే ఇలా ఉంటుంది అన్న ఆలోచనలలో ఈసినిమా దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సంవత్సరం మన ఇరు రాష్ట్రాలలోను విద్యార్ధులకు సంబంధించిన పరీక్షలు మార్చి ఆఖరి వారానికి అయిపోతాయి కాబట్టి ఒక వారం ముందుగా వస్తే కలక్షన్స్ విషయంలో ఎటువంటి సమస్యా ఉండదు అన్న ఆలోచనలు ఈసినిమా నిర్మాతలు చేస్తున్నారు అని లేటెస్ట్ టాక్.  దీనికితోడు ఈసినిమా సెకండ్ ఆఫ్ అద్భుతంగా వచ్చింది అన్న ప్రచారం ఫిలింనగర్ లో మొదలైంది. 

ఈసినిమాకు దగ్గరలో మరే భారీ సినిమా పోటీ లేకపోవడం ‘కాటమరాయుడు’ కు ‘బాహుబలి 2’ కు మధ్య నెల రోజుల గ్యాప్ ఉంది అన్న కారణాలు చూపెట్టి ‘కాటమరాయుడు’ ఈ రేంజ్ లో రేట్లు కోట్ చేస్తున్నారు అని ఫిలింనగర్ టాక్. దీనితో ‘ఖైదీ’ సూపర్ సక్సస్ ‘కాటమరాయుడు’ బయ్యర్లకు తలనొప్పిగా మారింది అన్న సెటైర్లు పడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: