సమంత  చాలా సుకుమారంగా ఉన్న నేపధ్యంలో ఆమెకు ఆఫర్ చేసే పాత్రలు కూడ చాలా సుకుమారంగా ఉంటాయి. క్యూట్ క్యూట్ మాటలతో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తాను చేసే పాత్రలలో అందరినీ కట్టిపడేస్తుంది సమంత.  అటువంటి  క్యూట్  హీరోయిన్  మాంసం నరికే కత్తి పట్టుకుని హత్యలు చేయడానికి రెడీ అయిపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.  ప్రస్తుతం తమిళంలో సమంత  ‘అనీతి కథైగల్’ సినిమాలో  నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈమూవీకి సంబంధించి తన ట్విట్టర్లో సమంత షేర్ చేసిన ఫొటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. 

సమంత షేర్ చేసిన ఈ ఫోటోలో ఆమె కత్తి పట్టుకుని ఎవరినో నరకడానికి రెడీ అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే  సమంత ముందున్న వ్యక్తి ఎవరన్నది  క్లారిటీలేదు బహుశా అది హీరో విజయ్ సేతుపతి అని అంటున్నారు.  అయితే సమంత నటిస్తున్న ఈసినిమాకు సంబంధించి పాత్ర స్వభావం రీత్యా ఇలా కత్తి పట్టుకుందా లేదా సరదాకి సమంత ఇలా  పట్టుకుందా అన్న విషయమై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
తమిళంలో అనేక అవార్డులు పొందిన ‘అరణ్య కాండం’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన త్యాగరాజన్ కుమార్ రాజా డైరెక్షన్లో  రూపొందింప పడుతున్న సినిమా ఇది. వైవిధ్యమైన సినిమాలకు దర్శకుడిగా ఇతడికి మంచి పేరు ఉంది.  ఈ సినిమాకు సంబంధించి సమంత ఈ ఫొటోను షేర్ చేస్తూ కుమార్ రాజా  దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ  రొమాంటిక్ కామెడీ అని వ్యాఖ్యానించింది.

దీనితో  సమంత ఏంటి అలా కత్తి పట్టడం ఏంటి అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో తెగ చర్చలు చేస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని సమంత చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. 

ఈ చిత్రానికి ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం.  నాగ చైతన్యతో ఆమె పెళ్లి ఫిక్స్ అయిన తరువాత విడుదల కాబోతున్న సినిమా ఇది ‘అవినీతి కథైగల్’ తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయబోతున్నారు  కాబట్టి ఈ కత్తి వ్యహారం ఏమిటో బయటకు వస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: