తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా యావరేజ్ గా ఉన్నా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. వాస్తవానికి రాంచరణ్ నటించింది చాలా తక్కువ సినిమాలు..కానీ దాదాపు అన్నీ సూపర్ హిట్ గానే నిలిచాయి. కాకపోతే ఆ మద్య గోవింధుడు అందరివాడేలే, బ్రూస్ లీ చిత్రాలు నిరాశపరిచాయి. గత సంవత్సరం ‘ధృవ’ తో మరో సెన్సేషనల్ హిట్ కొట్టాడు చరణ్.
ఈ సంవత్సరం తన తండ్రి మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం అంచనాలు దాటి సూపర్ డూపర్ హిట్ అయ్యింది..ప్రస్తుతం ఈ జోష్ లో ఉన్న రాంచరణ్..డైరెక్టర్ సుకుమార్ తో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రీ లుక్ పోస్టర్ తోనే సినిమాపై కావాల్సినంత ఆసక్తి రేకెత్తించాడు సుకుమార్. ఈ సినిమా పక్కా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఎప్రిల్ 1 నుంచి షూటింగ్ కు వెళ్లనుంది ఈ చిత్రం. తొలిరోజు నుంచే రామ్ చరణ్, సమంత షూటింగ్ లో పాల్గొననున్నారు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. స్టోరీ విషయానికి వస్తే..రాంచరణ్ పల్లెటూరి కుర్రాడు సిటీకి వస్తాడు. పైగా అతడు చెవిటివాడు. సిటిలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందట..అదే సమయంలో ఆ హీరోపై కొందరు సైంటిఫిక్ ప్రయోగం చేస్తారు.
అప్పుడు అతడి పరిస్థితేంటి.. ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ. అయితే రాంచరణ్ టాంటి మాస్ హీరోతో ఇలాంటి కాన్సెప్ట్ అంటే నిజంగా వండర్. అయితే చెవిటి వాడిగా రాంచరణ్ ఎలా మెప్పిస్తాడో..ధృవతో కొత్త దనం వైపు అడుగేసిన చరణ్.. ఇప్పుడు రేపల్లెతో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.