ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ‘మదర్స్ డే’ సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు శర్వానంద్ తల్లి వసుంధర తన కొడుకు శర్వానంద్ తో కలిసి ఇంటర్వ్యూ ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలను ఆమె షేర్ చేసింది. పిల్లలు నష్టపోతే తల్లితండ్రులు పడే బాధ చిన్నది కాదు అంటూ శర్వానంద్ నటుడుగా సంపాదించిన డబ్బును అంతా సినిమాతీసి నష్టపోయినప్పుడు తాను పడ్డ బాధ వర్ణనాతీతం అని అంటూ ఆ ఫెయిల్యూర్ నుండి శర్వానంద్ ఎంతో నేర్చుకున్నాడు అన్న కామెంట్స్ చేసింది వసుంధర.

ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ శర్వానంద్ తన కెరియర్ తొలిరోజులలో ‘అమ్మ చెప్పింది’ అన్న సినిమాలో కొడుకుగా నటించిన సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర కామెంట్స్ చేసింది వసుంధర. ఆ సినిమా చివరిన చనిపోయే సీన్ లో నటించడం చూసిన తనకు ఆతరువాత శర్వానంద్ ను ఎంత డబ్బు ఇచ్చినా అటువంటి పాత్రలు చేయవద్దు అన్న మాటను శర్వానంద్ నుండి తీసుకున్న విషయాన్ని బయట పెట్టింది వసుంధర.

ఇక శర్వానంద్ చిన్ననాటి విషయాలను షేర్ చేస్తూ శర్వానంద్ తన కడుపులో ఉన్నప్పుడు తరుచూ తాను భగవద్గీతను విషయాలను బయట పెట్టింది శర్వానంద్ తల్లి. తాను తరుచూ విన్న భగవద్గీత ప్రభావం వల్ల శర్వానంద్ పుట్టిన తరువాత చిన్న వయస్సులో తాను ధ్యానం చేస్తానని తనకు కృష్ణుడు అంటే చాల ఇష్టం అంటూ తరుచూ ధ్యానంలో ఉండేవాడన్న విషయాన్ని బయట పెట్టింది వసుంధర.   

ఇదే ఇంటర్వ్యూలో శర్వానంద్ మాట్లాడుతూ ‘మదర్స్ డే’ నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజు ‘అమ్మ’ ను జాగ్రత్తగా చూసుకోవడం పిల్లల బాధ్యత అని అంటూ తన తల్లితో తనకు ఉన్న సాన్నిహిత్యం పై అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు శర్వానంద్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: