తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన నటులు చాలా తక్కువ మందే ఉన్నారు.  అయితే కొంత మంది మంచి సక్సెస్ బాటలో నడిచారు.  అలాంటి వారిలో ఒకరు సంపూర్ణేష్ బాబు. ఇండస్ట్రీకి చిన్న నటుడిగా ఎంట్రీ ఇచ్చి ‘హృదయకాలేయం’ చిత్రంతో బర్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత ‘సింగబ123’, ‘వైరస్’ త్వరలో రాబోతున్న ‘కొబ్బరిమట్ట’ చిత్రంలో నటించారు.  కేవలం హీరోగానే కాకుండా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు.
Image result for big boss sampo
 అప్పుడప్పుడు కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.  ఇక బుల్లితెరపై మొట్ట మొదటి సారిగా భారీ ఎత్తున వస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’.  ఈ కార్యక్రమానికి హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారు.  అయితే బిగ్ బాస్ షో మొదలయ్యే వరకు అందులో పాల్గొనే కంటెస్టన్స్ ఎవరో తెలియకుండా చాలా సీక్రెట్ గా ఉంచారు.  ఇక బిగ్ బాస్ షో మొదలైన రోజు..ఒక్కొక్కరూ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ అవుతన్నప్పుడు కానీ తెలియలేదు..వారి ముఖాలు.  
Image result for big boss sampo
అయితే ఎంట్రీ ఇచ్చిన పద్నాలు మందిలో చాలా వరకు ఫేడ్ అవుట్ అయిన ముఖాలే ఉన్నాయి..కొద్ది మంది తప్ప.  అందరికీ ఆశ్చర్యాన్ని ఇస్తూ..బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇవ్వడం..ఎన్టీఆర్ అతన్ని తెగ పొగిడేయటం జరిగింది.  అయితే బిగ్ బాస్ లోకి సంపూ ఎంట్రీ ఇచ్చే సమయంలో నువ్వు సంపూగా వెళ్తావా..సొంత పేరు నర్సింహా చారిగా వెళ్తావా..అంటే సంపూని అక్కడి వారు తట్టుకోవడం కష్టం అని నర్సింహాచారిగా వెళ్తా అని తెగ బిల్డప్ ఇచ్చి వెళ్లాడు సంపూ.

 మనోడు అనూహ్యంగా ఫస్ట్ కెప్టెన్సీ దక్కించుకున్నాడు..కానీ మూడు రోజులకే కెప్టెన్సీని కోల్పోయాడు.  అంతే కాదు ఏడో రోజుకి బిగ్ బాస్ పై కోపగించుకొని పిచ్చి పట్టిన వాడిగా ప్రవర్తించి బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయాడు.  తాజాగా ఎన్టీఆర్ బర్నింగ్ స్టార్ సంపూరి బిగ్ బాస్ షో ముందు హాజరు పరిచారు.  ఆ సమయంలో సంపూర్ణేష్ బాబు తాను బిగ్ బాస్ షో నుంచి వెళ్లిపోవడం చాలా తప్పు పని చేసినట్లుగా భావిస్తున్నానని అన్నారు.
Image result for big boss sampo
అంతే కాదు ఫేస్ బుక్ లో నన్ను చాలా మంది నువ్వ వేస్ట్..నువ్వ హీరోవా బిగ్ బాస్ అనే పోటీ కంటెంట్ లో నిలబడలేనోడివి హీరోగా పనికి వస్తావా అని తిట్టి పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాను చిన్న గ్రామం నుంచి వచ్చానని ఒంటరి తనం అలవాటు లేదని అక్కడ నాలుగు గోడల మద్య బందీగా ఉన్నట్లనిపిస్తుందని మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యానని చెప్పారు.  అప్పుడు ఎన్టీఆర్ బిగ్ బాస్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు అని ఓదార్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: