తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు.  అయితే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అంతగొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ సం పాదించింది పవన్ కళ్యాన్ ఒక్కరే.  ఇక పవన్ కళ్యాన్ కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవాదృక్ఫదంతో ప్రజలకు సేవచేయాలన్న ఆలోచనతో ‘జనసేన’ అనే పార్టీ స్తాపించారు.  
Image result for pawan kalyan janasena
ఇప్పటికే రాజధాని భూ నిర్వాసితుల గురించి ప్రభుత్వంతో పోరాడారు..ఇక ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే తిరుపతి, కాకినాడ, అనంతపురంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి మాట్లాడారు.  అంతే కాదు 2019 ఎలక్షన్స్ లో ప్రత్యేక్షంగా పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు.  ఇక ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేయబోతున్నట్లు ఆమద్య చెప్పారు.  ఈ మద్య ఇండస్ట్రీలో, రాజకీయ వర్గాల్లో పవన్ ని గురించి పాజిటీవ్ గా కన్నా నెగిటీవ్ గా ఎక్కువ మాట్లాడేవారు తయారయ్యారు.  
Image result for tammareddy bharadwaj
పవన్ పై ఎంతగా ఫైర్ అయితే మీడియా వారు అంతగా ఫోకస్ చేస్తారన్న భావనలో ఉన్నట్లు తెలుస్తుంది.  అంతేకాదు పవన్ ని విమర్శించడం వల్ల లైమ్ లైట్ లో ఉంటామని భావిస్తారేమో కానీ కొంతమంది అయితే అదే పని మీద ఉన్నారు.తాజాగా ఈ లీస్టు లోకి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేరినట్లు తెలుస్తుంది.  
Image result for pawan kalyan padayatra
ఈ మద్య తమ్మారెడ్డి మాట్లాడుతూ..ప్రజా సమస్యలపై పవన్ పాదయాత్ర చేయాలని అప్పుడే ప్రజా సమస్యలు అర్ధం అవుతాయని , సెక్యూరిటీ ఇబ్బంది ఉందని పాదయాత్ర మానేస్తే పవన్ రాజకీయ నాయకుడు ఎట్లా అవుతాడని విమర్శిస్తున్నాడు.  గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న తమ్మారెడ్డి గతంలో కూడా పవన్ పొలిటికల్ లైఫ్ గురించి విమర్శలు చేయడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: