తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటి వరకు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ‘స్పైడర్’ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  గత సంవత్సరం నుంచి ఊరిస్తూ..ఊరిస్తూ..వస్తున్న టీజర్ ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయ్యింది.  
Image result for mahesh spyder movie stills
శ్రీమంతుడు లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం తర్వాత ‘బ్రహ్మోత్సవం’ లాంటి డిజాస్టర్ లో నటించారు మహేష్.  దీంతో తర్వాత చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని..తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో  ‘స్పైడర్’ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా రిలీజ్ అయిన స్పైడర్ టీజర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలిసిపోతుంది.  ఇన్నాళ్లు మహేష్ బాబు నిరీక్షించిన దానికి మంచి ఫలితం చూడబోతున్నట్లు తెలుస్తుంది.
Image result for mahesh spyder movie stills
సరిగ్గా ఒక నిమిషం పది సెకండ్ల పాటు ఉన్న స్పైడర్ టీజర్ చాలా లావిష్ గా గ్రాండియర్ లుక్ లో ఉంది ఇక ఆ టీజర్ ని చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు.  మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ మహేష్ సరసన నటిస్తుండగా ఎస్ జెసూర్య , భరత్ లు విలన్ లుగా నటిస్తున్నారు .
Image result for mahesh spyder movie stills
ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్  మహేష్ బాబుకి ఏపీహెరాల్డ్.కామ్ శుభాకాంక్షలు తెలుపుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: