వరస ఫ్లాప్ లతో సతమతమౌతూ ఈమధ్య కాలంలో వరస సమస్యల మధ్య టెన్షన్ పడుతున్న మాస్ మహారాజ రవితేజాకు ఈరోజు జరుగుతున్న ఇండిపెండెన్స్ డే ఊరట కలిగించింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈరోజు విడుదలైన ‘రాజా ది గ్రేట్‌' మూవీ టీజర్ రవితేజాలో ఏమాత్రం స్పీడ్ తగ్గలేదు అని మరొకసారి నిరూపించింది. 

ఈమూవీలో అంధుడుగా కనిపించబోతున్న మాస్‌ మహరాజ తనదైన బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తూ 'వెల్‌కమ్‌ టు మై వరల్డ్‌' అంటూ చెప్పిన డైలాగ్ తో పాటు 'సర్వేంద్రియానాం సర్వం ప్రధానం' అంటూ మరో ఇంట్రెస్టింగ్‌ ట్విస్ట్ ఇస్తూ ఇప్పటి వరకు వాడుకలో ఉన్న ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ మాటల అర్ధాలు మార్చాడు. 

అంధుడైతే మాత్రం అన్నీ చేయగలడు అన్న భావం వ్యక్త పరుస్తూ తాను ఇప్పటికీ మాస్ ప్రేక్షకుల మాస్ మహారాజాని అని రుజువు చేసేడట్లుగా ఈ టీజర్ లో రవితేజా నటన ఉంది. ముఖ్యంగా దర్శకుడు అనీల్ రావిపూడి మాస్ ప్రేక్షకులు ఇష్టపడే యాక్షన్ సన్నివేశాలతో ఈసినిమా నింపేసినట్లుగా కనిపిస్తోంది. 

ప్రస్తుతం క్రికెట్ ఫుడ్ బాల్ తరువాత  మనదేశంలో పెరిగిపోతున్న కబడ్డీ మ్యానియాను దృష్టిలో పెట్టుకుని ఈమూవీలో రవితేజను కబడ్డీ ప్లేయర్‌గా చూపించారు. 'ఐ యామ్‌ బ్లైండ్‌ బట్‌ ఐ యామ్‌ ట్రైన్డ్‌' అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌ టీజర్‌కే హైలైట్‌ అని అంటున్నారు. 

ఈమూవీలో మెహరీన్‌ పిర్జాదా 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' ఫేం హీరోయిన్‌ గా కనిపిస్తూ ఉంటే కొంత గ్యాప్ తరువాత రాధిక మళ్ళీ తల్లిగా రీ ఎంట్రీ ఇస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని నవంబర్ లో విడుదల చేయబోతున్నారని టాక్.  ఈమూవీతో తిరిగి రవితేజ ట్రాక్ లోకి వచ్చినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: