తెలుగు ఇండస్ట్రీలోకి ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తేజ తర్వాత ‘జయం’ సినిమాతో ఒక్కసారే స్టార్ దర్శకులుగా మారిపోయారు.  ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఇండస్ట్రీలో తేజ కనుమరుగయ్యారని వార్తలు వచ్చాయి. అంతే కాదు మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించే తేజ పలు సందర్భాల్లో తన కాంట్రవర్సరీ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు.  
Image result for teja rana
ఇక వారసత్వపు హీరోగా ‘లీడర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రానా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.   అయితే హీరోగా మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేక పోయాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన  ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్ కొట్టి 3వ వారంలోకి ఎంటర్ అయింది.  పొలిటికల్ డ్రామా, అద్భుతమైన సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి నుంచి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.  
Image result for nane raju nane mamtri stills
మొత్తానికి  ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో దర్శకుడు తేజకు పదేళ్ల తర్వాత పెద్ద హిట్, రానా కెరీర్లో బిగ్ హిట్ అనిపించుకుంది.  ఇక ఈ సినిమాతో నితిన్ ‘లై’,  బోయపాటి శ్రీనివాస్, బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయ జానకి నాయక’ చిత్రాలు ఒకేసారి విడుదలైనప్పటికీ కలెక్షన్ల విషయంలో  ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్ కొట్టి కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది.    వినాయకచవితి వీకెండ్‌తో 25 కోట్ల షేర్ మార్క్ అందుకోనుందని ట్రేడ్ టాక్.

Image result for nane raju nane mamtri stills

2 వారాల వసూళ్లు ఏరియాల కలెక్షన్లు :


నైజాం : 7.85


ఉత్తరాంధ్ర : 2.62 


సీడెడ్ : 2.5 


ఈస్ట్ : 1.70 


గుంటూరు : 1.42


కృష్ణ : 1.39 


వెస్ట్ : 92 లక్షలు

నెల్లూరు : 55 లక్షలు 


టోటల్ నైజాం + ఆంధ్రప్రదేశ్ : 18 కోట్ల 95 లక్షలు 


వరల్డ్ వైడ్ : 23 కోట్ల 50 లక్షలు


మరింత సమాచారం తెలుసుకోండి: