తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోల హవా నడుస్తుంది.  ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇప్పటి జనరేషన్ లో వచ్చిన హీరోలు నాని, శర్వానంద్, నిఖిల్, రాజ్ తరుణ్ రీసెంట్ గా విజయ్ దేవరకొండ తమ సత్తా చాటుతున్నారు. ఇక శర్వానంద్ విషయానికి వస్తే..రన్ రాజా రన్ చిత్రంతో మనోడు మంచి విజయం సాధించిన తర్వాత వరుసగా ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి చిత్రాలతో మంచి విజయం సాధించాడు. అది కూడా పెద్ద హీరోల సినిమాల టైమ్ లోనే రిలీజ్ చేస్తూ ఆ సినిమాలకు పోటీగా కలెక్షన్లు సాధించాడు. 
Image result for mahanubhavudu movie posters
తాజాగా శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’ చిత్రం రిలీజ్ అయ్యింది.  ఇక తన కామెడీ టైమింగ్ తో థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల కెపాసిటీ ఉన్న దర్శకుడు మారుతి.  కొత్తజంట, ప్రేమకథా చిత్రం, భలే భలే మగాడివోయ్ చిత్రాలతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు.  ఇక అప్పటి వరకు మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నానికి ‘భలే భలే మగాడివోయ్’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందించాడు.
Image result for mahanubhavudu movie posters
తాజాగా  ఓసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) అనగా అతి శుభ్రత.. ఈ లక్షణంతో ఉండే కుర్రాడు తన ప్రేమ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు..చివరికి ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్న కాన్సెప్ట్ తో మరోసారి అభిమాను ముందుకు వచ్చాడు.  ఇక సినిమా విషయానికి వస్తే.. ఓసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) అనగా అతి శుభ్రత.. ఈ లక్షణంతో ఉండే కుర్రాడు ఆనంద్ (శర్వానంద్)  ఎవరైనా చిన్న అశుభ్రతతో కనిపించినా ఓవర్ గా రియాక్టవుతుంటాడు. ఇది ఎంతగా అంటే..జబ్బుతో ఉంటే కనీసం కన్నతల్లిని కూడా దగ్గరకు రానివ్వనంతటి శుభ్రత అతనిది.
Related image
అలాంటి కుర్రాడు తన కొలిగ్ హీరోయిన్ మేఘన (మెహరిన్) ప్రేమలో పడతాడు.  హీరో గారి ఓసిడి ని కొంత భరించినా అది పీక్ స్టేజ్ కి వెళ్లేసరికి తట్టుకోలేక తన ప్రేమకు బ్రేకప్ చెబుతుంది.  దీంతో తన ప్రేమను దక్కించుకోవడానికి ఓసిడికి, ప్రేమకి మధ్యన ఎలా హీరో నలిగిపోయాడు అన్న అంశం చిత్రంలో చాలా బాగా చూపించారు.  ‘భలే భలే మగాడివోయ్’ లో మతిమరుపు క్యారెక్టర్ తో సక్సెస్ సాధించిన మారుతి..ఈ సారి ఓసిడి  కలిగిన హీరో పాత్రతో చాలా బాగా చూపించడమే గాక వాటి ద్వారానే మంచి హెల్తీ ఫన్ ను జనరేట్ చేశాడు.
Image result for mahanubhavudu movie working stills
ఫస్టాఫ్ అక్కడక్కడా కొంచెం నెమ్మదించినా సెకండాఫ్ నుండి సినిమా ఊపందుకుని చివరి వరకు ఫన్, లవ్, ఎమోషన్ వంటి అంశాలతో పూర్తి వినోదాన్ని పంచింది. ఇక మెహ్రీన్, శర్వాల లవ్ ట్రాక్ కూడా కీలకంగా ఉండి ఎక్కడా బోర్ కొట్టలేదు. సంగీత దర్శకుడు థమన్ సినిమాకు కావాల్సిన మంచి సంగీతాన్ని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చి తన వంతు న్యాయం చేశాడు.

నాజర్, వెన్నెల కిషోర్ చాలా అద్భుతంగా నటించారు. అక్కడక్కడా కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయని  ఆడియన్స్ అంటున్నారు.   మొత్తం మీద ఈ ‘మాహానుభావుడు’ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు ఆడియన్స్.  మరి ఈ సినిమా రిజల్ట్ రేపటి వరకు ఎలా ఉండబోతుంది..సినిమా కలెక్షన్లు ఎలా రాబోతున్నాయి..సినిమా హిట్టా..ఫట్టా అన్న విషయం రేపటి తో తెలిసిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: