తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో ఎన్నో సంచలనాలు సృష్టించిన చిత్రం బాహుబలి, బాహుబలి 2.   దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదు చేసుకుంది. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ రికార్డులు కూడా బద్దలు కొట్టింది. 
Image result for baahubali 2
ఈ చిత్రంలో నటించిన నటులకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ముఖ్యంగా బాహుబలి గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అయితే క్రేజీ హీరోగా మారిపోయారు.  ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రం కోసం ప్రభాస్ ఏకంగా ఐదు సంవత్సరాలు తన అమూల్యమైన టైమ్ కేటాయించాడు.  ఈ సమయంలో ఏ సినిమా కూడా ఒప్పుకోకుండా ఎంతో డెడికేషన్ గా పనిచేశారు.
Image result for saaho movie
తన శ్రమకు మంచి ఫలితం దక్కింది.. జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇక బాహుబలి 2 రిలీజ్ తర్వాత రాజమౌళి తప్ప అందరు నటులు సినిమాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేస్తోన్న ‘సాహో’ చిత్రంపై నటిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆ సినిమా షూటింగులోనే ప్ర‌భాస్ బిజీబిజీగా ఉన్నాడు.

ఆ నేప‌థ్యంలో అప్పుడ‌ప్పుడు ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు ఫొటోలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా ప్రభాస్ స‌రికొత్త లుక్‌లో ప్ర‌భాస్ క‌నిపించిన ప్ర‌తీసారి ‘సాహో’ సినిమాలో ప్ర‌భాస్ లుక్ ఇదేనేమో? అని అభిమానులు అనుకుంటున్నారు. జేబులో చేతులు పెట్టుకుని, గ‌ళ్ల తెలుపు రంగు చొక్కా వేసుకుని, చిరున‌వ్వు చిందిస్తూ ఆయ‌న క‌న‌ప‌డుతున్నాడు.  మొత్తానికి ప్రభాస్ కొత్త లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: