మొదటి సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారినా ఇప్పటికీ కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా అఖిల్ కొనసాగుతున్నాడు అంటే అఖిల్ కు యూత్ లో ఉన్న క్రేజ్ అర్ధం అవుతుంది. దీనితో ఈ క్రేజ్ ను ఎలాగైనా తన సినిమాలకు ఉపయోగించుకోవాలని అఖిల్ ‘హలో’ సినిమా విషయంలో చాల కష్టపడుతున్నాడు. 

ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకులలో తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి అఖిల్ ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. ప్రస్తుతం తాను నాటిస్తున్న ‘హలో’ మూవీకి ఓవర్సీస్ లో డాలర్ల వర్షం కురిపించడానికి అమెరికాలో నాలుగు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొనబోతున్నాడు అఖిల్. డిసెంబర్ 15-17 తేదీలమధ్య అమెరికాలో అఖిల్ చేయబోతున్న డాన్స్ పరేడ్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ మ‌ధ్య న్యూజెర్సీలో అఖిల్ లైవ్ లైవ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కు వచ్చిన క్రేజ్ రీత్యా అమెరికాలో మ‌రో డాన్స్ ప‌రేడ్ ‘హలో’ కోసం చేస్తున్నాడు. 

న్యూజెర్సీ, డాల‌స్‌, శాన్ హోజెలో అఖిల్ లైవ్ షోలు జ‌రుగుతాయి. ఎన్నారైల‌తో ప్ర‌త్యేక మీట్ కూడా ఉంటుంద‌ట‌. ఇలా అఖిల్ ‘హలో’ విడుదలకు ముందే ఇంత హడావిడి చేయడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. ఈ మ‌ధ్య ఇంట‌ర్నెట్ టాలీవుడ్ బిగ్ సినిమాల ఫేట్ ను నిర్ణయిస్తోంది. టాప్ హీరోల సినిమాల మొట్టమొదటి షోలు మన తెలుగు రాష్ట్రాలలో కంటే ముందుగానే ప్రీమియర్ షోల రూపంలో అమెరికాలో పడుతున్న నేపధ్యంలో ఓవర్సీస్ ప్రేక్షకులు ఇచ్చే రిపోర్ట్ లు చాల కీలకంగా మారుతున్నాయి. 

ఓవర్సీస్ ప్రేక్షకులు ఒక సినిమాకు నెగిటివ్ టాక్ ను చెపితే ఆటాక్ మన తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకుల అభిప్రాయాల పై విపరీతంగా ప్రభావం చూపెడుతోంది. ఈ పరిస్థుతులలో అఖిల్ తన ‘హలో’ కి సంబంధించి అమెరికా నుండి తన వ్యూహాలను సెట్ చేసుకుని వస్తూ ఉండటం టాలీవుడ్ టాప్ హీరోల భారీ సినిమాలకు సంబంధించిన ఒక కొత్త ఆలోచన. బాలీవుడ్ హీరోలు ఇప్పటికే అనుసరిస్తున్న ఈ ప్లాన్ ను ఇప్పుడు అఖిల్ అనుసరిస్తూ ఉండటంతో అఖిల్ కొత్త ప్లాన్ ను మన టాప్ హీరోలు కూడ భవిష్యత్ లో ఫాలో అయ్యే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: