రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో తీస్తున్న లేటెస్ట్ మూవీలో అనుష్కను తీసుకునే ఛాన్స్ ఉందని మొన్నటివరకు ప్రచారం జరిగింది. కానీ అందరికీ ఊహకు అందని విధంగా వర్మ ఈవిషయాలకు మరో ట్విస్ట్ ఇచ్చాడు. తన సినిమాలలో హీరోయిన్స్ ను చాల క్యూట్ గా హాట్ గా చూపించే వర్మ అనుష్కను కాకుండా మైరా సరీన్ అనే ఓ కొత్తమ్మాయిని తెలుగుతెరకు పరిచయం చేస్తున్నాడు. 

ఈవిషయమై తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ కూడా పెట్టాడు. ఆమె ఫొటోలు కూడా షేర్ చేశాడు. "నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్నది మీడియాలో రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి అవన్నీ తప్పు హీరోయినిగా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి తన పేరు మైరా సరీన్. ఈ ఫొటోలు ఆ అమ్మాయివి." అంటూ వర్మ పెట్టిన పోస్ట్ చూసి చాల మంది షాక్ అయ్యారు.

దాదాపు 55 సంవత్సరాలు పై పడ్డ నాగార్జున ఒక కొత్త బొంబాయి బ్యూటీతో కలిసి రోమాన్స్ చేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా ? అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈసినిమా ప్రీ-లుక్ లో భాగంగా నాగార్జునను రఫ్ లుక్ లో చూపించిన వర్మ మైరాను కూడా అదే విధంగా ప్రజెంట్ చేస్తూ తుపాకి పట్టుకున్న స్టిల్స్ తో పాటు తన మార్క్ హాట్ లుక్స్ తో కూడా కొన్ని స్టిల్స్ రిలీజ్ చేశాడు. 

అఖిల్ నటిస్తున్న ‘హలో’ విడుదల అయిన తరువాత ప్రారంభం కాబోయే ఈమూవీ కొత్త షెడ్యూల్ లో ఈమె షూటింగ్ స్పాట్ లో నాగ్ పక్కన జాయిన్ అవుతుందని టాక్. ఈసినిమా హిట్ అయితే ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వెంటాడుతున్న హాట్ హీరోయిస్స్ కొరతకు కొంత పరిష్కారం దొరికినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: