టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  మొదటి సినిమాతోనే మంచి మాస్ ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు.  రాజమౌళి దర్శకత్వంలో ‘చత్రపతి’ సినిమాతో ప్రభాస్ స్టార్ మొత్తం మారిపోయింది. 
Image result for baahubali 2
ఆ తర్వత డార్లింగ్, మిర్చి సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న ప్రభాస్ కి మరోసారి రాజమౌళి అపరూప కానుక అందించారు.  ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు.  మ‌ళ్లీ మ‌రోసారి వీరు క‌లిసి ప‌నిచేస్తారా? అనే ప్ర‌శ్న‌కు ఓ ఆంగ్ల ప్ర‌తిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి జ‌వాబిచ్చారు. ప్ర‌భాస్‌తో క‌లిసి నిర్విరామంగా ఐదేళ్ల ప‌నిచేశాను. మా ఇద్ద‌రికీ కాస్తంత బ్రేక్ కావాలి. ప్ర‌భాస్ ఇప్పుడు త‌న సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.
Related image
కాబ‌ట్టి ఇప్ప‌ట్లో ప్ర‌భాస్‌తో క‌లిసి ప‌నిచేయను అయితే భవిష్యత్ లో మాత్రం మంచి కథ ఉంటే..ప్రభాస్ తో తప్పకుండా చేస్తానని అన్నారు.  ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో `సాహో` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు, రాజ‌మౌళి ఎన్టీయార్‌, చెర్రీ కాంబినేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్ కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: