అజ్ఞాతవాసి’ మూవీలో హీరో వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్రను చేస్తున్న విషయం ఇప్పటికే లీక్ అయింది. అయితే ఈ పాత్ర ఈసినిమాలో కేవలం నాలుగు నిముషాలు మాత్రమే ఉంటుందట. మొదట్లో వెంకటేష్ పవన్ ల మధ్య ఒక కామెడీ సీన్ గా ఈ సీన్ ను చిత్రీకరించారు అని వార్తలు వచ్చాయి.

 

అయితే లేటెస్ట్ వార్తల ప్రకారం పవన్ వెంకటేష్ ల మధ్య ఒక యాక్షన్ ఫైట్ సీన్ ఉంటుందని టాక్. ఈ ఫైట్ సీన్ ఈసినిమాకే హైలెట్ గా ఉంటుందని ఈమూవీ యూనిట్ సభ్యులు లీకులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ ఫైట్ సీన్ ను చాల సీరియస్ గా తీసుకుని వెంకటేష్ పవన్ లు ఇన్వాల్వ్ అయి నటించారని తెలుస్తోంది.

 

దీనికితోడు ఈమూవీలోని పవన్ ‘కొడకా కోటేశ్వరరావు’ పాట కూడ హైలెట్ కాబోతున్న నేపధ్యంలో ఈ రెండు సర్ప్రైజ్ లను ఈమూవీ ఇంటర్వెల్ తరువాత వచ్చే సినిమాలో కనిపించి ప్రేక్షకులకు డబుల్ సర్ప్రైజ్ ఇస్తాయని టాక్. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించి త్వరలో విడుదల కాబోతున్న ట్రైలర్ లో ఈ మూవీ కథ పై రేఖా మాత్రంగా అర్ధం అయ్యే విధంగా లీకులు ఇచ్చి ఈ ట్రైలర్ ను అంతా పవన్ కామెడీ మార్క్ పంచ్ డైలాగ్స్ తో నింపి మరో వెరైటీ త్రివిక్రమ్ చూపించబోతున్నాడని అంటున్నారు.

 

దీనికితోడు ఈసినిమాలో నటిస్తున్న కీర్తి సురేశ్ పవన్ మరదలు పాత్రలో కనిపిస్తుందట. దీనితో ప్రేక్షకులకు త్రివిక్రమ్ తన ‘అత్తారింటికి దారేది’ మ్యాజిక్ ను గుర్తుకు చేస్తూ మరో రొటీన్ కథ అయినప్పటికీ తన పంచ్ డైలాగ్స్ తో అదేవిధంగా పవన్ మ్యానియాతో ఒక రొటీన్ కథను డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ చూపెత్తబోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. రేపు ఈసినిమాకు సెన్సార్ కార్యక్రమాలు జరగబోతున్న నేపధ్యంలో ఈమూవీ గురించి వచ్చే సెన్సార్ టాక్ పై ఆసక్తి నెలకొని ఉంది..

 


మరింత సమాచారం తెలుసుకోండి: