పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ‘అజ్ఞాతవాసి’ లేటెస్ట్ ట్రైలర్ చివర్న వచ్చిన డైలాగ్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ‘మళ్ళీ సైకిల్ ఎక్కుతాడా వర్మా’ అంటూ మురళీ శర్మ అడిగిన ప్రశ్నకు రావ్ రమేశ్ సమాధానం ఇస్తూ ‘వీడు ఎదేక్కినా పర్లేదు కానీ మనల్ని ఎక్కకుండా ఉంటే చాలు’ అన్న డైలాగ్ ఉంది. దీనితో ఈడైలాగ్ వెనుక పవన్ భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలు కనిపిస్తున్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 AGNATHAVASI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనికితోడు ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఈ టీజర్ లో వాడిన డైలాగ్స్ లో వేదాంత ధోరణి కూడ కనిపిస్తోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ ట్రైలర్ లో ఒక కుర్చీ ఎలా తయారవుతుందో వివరిస్తూ చెట్లను నరకడం బ్లేడ్లతో సానబెట్టడం మేకులు కొట్టడం అంటూ దానిని తయారుచేసే విధానం వివరించి మన జీవితంలో కోరుకునే ప్రతీ లగ్జరీ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయంటూ త్రివిక్రమ్ వ్రాసిన డైలాగ్ వెనుక పవన్ వేదాంత ధోరణి కనిపిస్తోంది.

 

అసలు ఈ ట్రైలర్ లో త్రివిక్రమ్ ఈమూవీకి సంబంధించిన కథకు సంబంధించి ఎటువంటి లీకులు ఇవ్వకపోయినా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే హీరోగా పవన్ ను చూపెడుతూ అసలు కథను దాచినట్లు అనిపిస్తోంది. అర్థరాత్రి 1 గంటకు బాగా లేటుగా త్రివిక్రమ్ ఈ ట్రైలర్ ను విడుదల చేసినా త్రివిక్రమ్ మాటల కూర్పు పవన్ మ్యానియా ఈ ట్రైలర్ ను ఆకాశానికి ఎత్తేసాయి.

 

ప్రస్తుతం ఈ ట్రైలర్ పవన్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడ బాగా కనెక్ట్ అయిపోయిన నేపధ్యంలో ఈ ట్రైలర్ ‘అజ్ఞాతవాసి’ మ్యానియాను మరింత పెంచి అత్యంత భారీ ఓపెనింగ్స్ కు దారి తీస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ట్రైలర్ లో ముగింపులో వచ్చిన సైకిల్ ప్రస్తావన మాత్రం రాజకీయ వర్గాలవారిని ఆలోచింప చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: