ప్రతి సంక్రాంతికి టాప్ హీరోల సినిమాల మధ్య పోటీ సర్వసాధారణ విషయమే అయినా ఈసారి టాప్ హీరో స్టేటస్ తో పాటు రాజకీయ నేపధ్యం ఉన్న పవన్ బాలకృష్ణల సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్న నేపధ్యంలో ఈమూవీలకు సంబంధించిన ధియేటర్స్ వార్ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈరెండు సినిమాలు తమ టాక్ తో సంబంధం లేకుండా సంక్రాంతి పండుగ ముగిసేలోగా వీలైనంత భారీ కలక్షన్స్ పై కన్ను వేయడంతో ఈ ధియేటర్స్ వార్ బయటకు కనపడకపోయినా ఈ టాప్ హీరోల మధ్య ఇగో వార్ గా మారిందని అంటున్నారు.

  ఎవరి సత్తా ఎంత?:

ఈ సంక్రాంతి రేస్ లో మరొక రెండు రోజులలో మొదటిగా వస్తున్నది ‘అజ్ఞాతవాసి’ కాబట్టి మన ఇరు రాష్ట్రాలలోని 90 శాతం ధియేటర్స్ ఈమూవీకి చిక్కాయి. అయితే కేవలం రెండు రోజుల గ్యాప్ లో ‘జై సింహా’ వస్తున్న నేపధ్యంలో ఎంత మేరకు పవన్ ‘అజ్ఞాతవాసి’ ని ప్రదర్శించే అదనపు ధియేటర్స్ బాలయ్యకు దక్కుతాయి అన్న విషయమై ఇప్పుడు ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.

  జైసింహా కూడా తగ్గట్లేదు:

ఇప్పటికే ‘జై సింహా’ నిర్మాత సి. కళ్యాణ్ ను తనకు ధియేటర్స్ విషయంలో అన్యాయం జరుగుతోంది అంటూ లీకులు ఇస్తున్నాడు. ఈ పరిస్థుతులలో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు సంబంధించిన ధియేటర్స్ ను ‘జై సింహా’ వైపు రప్పించడానికి ఈమూవీ నిర్మాతలు అనేక రాజకీయ ఒత్తిడులు చేస్తున్నట్లు కూడ వార్తలు వస్తున్నాయి. ప్రీ రిలీజ్ టాక్ విషయంలో ‘జై సింహా’ కంటే ‘అజ్ఞాతవాసి’ చాల ముందడుగులో ఉన్న నేపధ్యంలో ధియేటర్స్ అన్నీ ‘అజ్ఞాతవాసి’ వైపు మొగ్గు చూపడంతో చివరకు నికరంగా ‘జై సింహా’ కు ఎన్ని ధియేటర్స్ మిగులుతాయి అన్న విషయం పై స్పష్టత లేదు అని అంటున్నారు.

 సర్దుబాటు చేసుకుంటారా?

దీనికితోడు ఇదే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ సూర్య ‘గ్యాంగ్’ రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ కూడ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈసినిమాలకు సంబంధించి ప్రేక్షకుల తీర్పుకంటే ఎక్కువ సంఖ్యలో ఎవరు ధియేటర్స్ దక్కించు కుంటారు అన్న విషయం పై సంక్రాంతి వార్ కలక్షన్స్ ఉంటాయి అన్నది వాస్తవం. ప్రస్తుతానికి అన్ని విషయాలలో ‘అజ్ఞాతవాసి’ చాల ముందు వరసలో ఉన్నా ఎదో ఒక వ్యూహంతో ఎంతోకొంత ‘అజ్ఞాతవాసి’ ని ఇరుకున పెట్టాలని ప్రస్తుతం ‘జై సింహా’ నిర్మాతలు అనుసరిస్తున్న వ్యూహాలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: