రాజమౌళి త్వరలో ప్రారంభించబోతున్న చరణ్ జూనియర్ ల సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాజమౌళి నోటి వెంట ఫిబ్రవరి రెండవవారంలో వస్తుంది అని అంటున్నారు. ఇంకా ఈసినిమా ప్రారంభంకాకపోయినా ఈ సినిమా బడ్జెట్ పై అదే విధంగా ఈ సినిమా కథ పై ఇప్పటికే అనేక వార్తలు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. ‘బాహుబలి’ తో వచ్చిన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలకు నచ్చే కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

  ప్రతినాయకుడి పాత్ర కూడా కీలకమేనట..:

ఈ సినిమాకు సంబంధించిన కధలో కూడ రచియిత విజయేంద్రప్రసాద్‌ కొన్ని బలమైన క్యారెక్టరైజేషన్స్ రాసుకుని దానికి అనుగుణంగా కథను ఆపాత్రలను క్రియేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ ఎన్టీఆర్ ల పాత్ర ఎలా ఉండాలనే దానిపై ఒక అంచనాకు వచ్చిన రాజమౌళి దృష్టి ఈసినిమాకు సంబంధించి ప్రతి నాయకుడి పాత్ర పై పడినట్లు వార్తలు వస్తున్నాయి.

 బాక్సింగ్ నేపథ్యంలో: 

ఇప్పటికే రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో లోతైన చర్చలు జరిపినట్లు వార్తలు ఉన్నాయి దీనికితోడు రామ్ చరణ్ జూ. ఎన్టీఆర్‌ల ఇమేజ్‌కు సరిపోయే విధంగా పేరున్న హీరోతోనే  ఈసినిమాలో ప్రతినాయకుడి పాత్రను చేయించాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట. విజయేంద్రప్రసాద్ ఆ పాత్రను అంత బలంగా తీర్చిదిద్దతుడంతో రానా లాంటి విలన్ పాత్రదారి కోసం వెతుకుతున్నారట.

  ముగ్గురు హీరోలా?:

ప్రస్తుతం ఈపాత్రకు సంబంధించి రకరకాల నటుల పేర్లు రాజమౌళి మైండ్ లో ఉన్నా ఈపాత్రకు హీరో రానా తిరిగి ఎంపిక అయ్యే అవకాసం ఉంది అంటున్నారు.  ఇది కుదరకుంటే బాలీవుడ్ నుండి బాగా పేరున్న ఒక యంగ్ హీరోతో ఈవిలన్ పాతచేసే అవకాశం కూడ ఉంది అన్న  ప్రచారం కూడ జరుగుతోంది. ఈవార్తలే నిజం అయితే ఈమూవీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో కలిపి మొత్తం ముగ్గురు  హీరోలు నటించే సినిమాగా ఇది మారడం ఖాయం అని అంటున్నారు. ఈమూవీలో అన్నదమ్ములుగా చరణ్ త్రివిక్రమ్ లు నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీలో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని అంటున్నారు..  




మరింత సమాచారం తెలుసుకోండి: