సినిమా ఇండస్ట్రీల అంటే అదో అద్భుతమైన రంగుల ప్రపంచం అని అనుకుంటారు చాలా మంది.  అయితే ఆ రంగుల ప్రపంచం వెనుక చీకటి కోణాలు..భయంకర నిజాలు..కష్టాలు, కన్నీళ్లు, ఆవేదనలు ఎన్నో ఉంటాయి.  బయటకు కనిపించే తారల వెనుక ఎన్నో ఇబ్బందులు..కష్టాలు ఉంటాయి...వారి కుటుంబ పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది.  స్టార్ హీరోల విషయాలు పక్కన బెడితే..ఈ మద్య వస్తున్న కొంత మంది నటీ,నటులు మాత్రం విషయంలో జరుగుతున్న పరిస్థితులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
నటుడు సామ్రాట్
తాజాగా సినీ నటుడు సామ్రాట్ రెడ్డి పై ఆయన భార్య ఫిర్యాదు చేయడం 498/A కేసు నమోదు చేసి మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.  ఇప్పుడు సోషల్ మీడియాలో సామ్రాట్ పై కొత్త కథనాలు మొదలయ్యాయి. నటుడు సామ్రాట్ రెడ్డిలో బయటకు కనిపించని కోణాలు చాలానే ఉన్నాయా?.. పైకి జెంటిల్‌మెన్‌లా పోజు కొడుతూ అవలక్షణాలన్నీ ఒంటపట్టించుకున్నాడా?.. సామ్రాట్ భార్య, అతని మామ చేస్తున్న ఆరోపణలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది.
 మరో కోణం:
డ్రగ్స్, సెక్స్.. ఈ రెండు సామ్రాట్‌కు వ్యసనంగా తయారైనట్లు అతని భార్య హర్షితా రెడ్డి, మామ ఆరోపిస్తున్నారు. కాల్ గర్ల్స్‌తో సంబంధాలు మాత్రమే కాకుండా.. విడాకులు తీసుకున్న ఇద్దరు మహిళలతోనూ సామ్రాట్ సంబంధం పెట్టుకున్నాడని అతని మామ ఆరోపించారు. సామ్రాట్ రెడ్డికి ఎంతో మంది మగ స్నేహితులు ఉన్నారని, ఆయన ఓ గే అన్న విషయం కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని షాక్ తిన్నానని హర్షిత ఆరోపించింది. 
 వదిలి ఉండకపోయేవాడు..:
బయటకు వెళ్లినప్పుడు డ్రైవింగ్ సీట్లో తనను కూర్చోబెట్టి, లేడీ డ్రైవర్ మాదిరిగా చూస్తుండేవాడని ఆరోపించింది. హుక్కాకు సామ్రాట్ బాగా ఎడిక్ట్ అయ్యాడని, పద్దతి మార్చుకోవాలని చెప్పితే.. వెకిలిగా ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయేవాడని అన్నారు.అమ్మాయిలతో సంబంధాల గురించి సామ్రాట్ తల్లికి చెప్పితే.. ఆమె తననే దబాయించిందని హర్షితా రెడ్డి అన్నారు.
హర్షితా రెడ్డి ఆవేదన..:
కొడుకుకి బుద్ది చెప్పాల్సిందిపోయి.. 'ఊరి నుంచి వచ్చినవాళ్లకు ఏమి తెలుస్తాయి.. ఇది బంజారాహిల్స్.. ఇక్కడ ఇలాగే ఉంటారు' అంటూ తనపైనే కోపగించుకునేవారి వాపోయింది. ఎప్పటికైనా మారుతాడన్న ఆశతో సామ్రాట్ గురించి ఎన్ని విషయాలు తెలిసినా, మనసులో బాధపడ్డానే తప్ప బయటపెట్టలేదని, చాన్నాళ్లు ఎదురు చూశానని హర్షిత వాపోయింది.
Image result for నటుడు సామ్రాట్
అలాగే తన తండ్రి షేర్లను బదిలీచేయమని కోరితే దీనికి అంగీకరించకపోవడంతో గత ఏడాది నుంచి వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయని ఆమె తెలియజేశారు.  తన భద్రత కోసం తన తండ్రి సీసీటీవీ కెమెరాలను ఇంట్లో ఏర్పాటుచేయడం వల్లే, సామ్రాట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లభించిందని హర్షిత తెలిపింది. భార్య ఫిర్యాదుతో సామ్రాట్‌రెడ్డిని మాదాపూర్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: